సచిన్ రికార్డు బద్దలు కొట్టిన 15 ఏళ్ల కుర్రోడు

  • Published By: madhu ,Published On : February 9, 2020 / 11:24 AM IST
సచిన్ రికార్డు బద్దలు కొట్టిన 15 ఏళ్ల కుర్రోడు

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సాధించిన రికార్డును 15 ఏళ్ల కుర్రోడు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ వన్డే క్రికేట్‌లో హాఫ్ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడగా ఘనత సాధించాడు నేపాలీ యువ బ్యాట్‌మెన్. ICC మెన్స్ క్రికెట్ వర్డల్ కప్ లీడ్ – 2 మ్యాచ్‌లు జరుగుతున్నాయి.

UNAతో జరుగుతున్న మ్యాచ్‌లో నేపాల్ బ్యాట్ మెన్ కుశాల మల్లా..సునామీ సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 51 బంతులను ఎదుర్కొన్న మల్లా..50 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా మరో నేపాల్ ఆటగాడు రోహిత్ కుమార్‌ పాడెల్ పేరిట ఉండేది. రోహిత్ 16 ఏళ్ళ 146 రోజులకు అర్థ శతకం సాధిస్తే..కుశాల్ 15 ఏళ్ల 340 రోజుల వయస్సులోనే సాధించాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (16 ఏళ్ల 213 రోజులు), పాక్ మాజీ బ్యాట్స్ మెన్ షాహీద్ ఆఫ్రిదీ (16 ఏళ్ల 217 రోజులు), మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.