Australia - India: ఆస్ట్రేలియాలో మారిన ప్రభుత్వం: భారత్‌కు లాభమా? నష్టమా? | Labour Party ousts Scott Morrison govt, Australia sends message to India

Australia – India: ఆస్ట్రేలియాలో మారిన ప్రభుత్వం: భారత్‌కు లాభమా? నష్టమా?

దాదాపు 40 ఏళ్లుగా ఆస్ట్రేలియాతో బంధం కొనసాగిస్తున్న భారత్ తో ఇకపై యధావిధిగా సత్సంబంధాలు కొనసాగేనా? ప్రధానంగా క్వాడ్ కూటమిలో ఆస్ట్రేలియా - భారత్ భాగస్వామ్యం, ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఎలా ఉండనున్నాయనేది..ఆసక్తికరంగా మారింది

Australia – India: ఆస్ట్రేలియాలో మారిన ప్రభుత్వం: భారత్‌కు లాభమా? నష్టమా?

Australia – India: ఆస్ట్రేలియాలో ప్రభుత్వం మారింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీని సాగనంపిన ప్రజలు..లేబర్ పార్టీకి పట్టం కట్టారు. ఈక్రమంలో లేబర్ పార్టీ అభ్యర్థి ఆంటోనీ అల్బనీస్ మరికొన్ని రోజులో ఆస్ట్రేలియా ప్రధానిగా భాద్యతలు స్వీకరించనున్నారు. దాదాపు 9 ఏళ్ల అనంతరం ఆస్ట్రేలియాలో లేబర్ పార్టీ తిరిగి అధికారం చేజిక్కించుకుంది. ఈ తొమ్మిదేళ్లలో రాజకీయంగా, విదేశాంగ-దౌత్య పరంగానూ అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలతో ఆస్ట్రేలియా దౌత్యబంధాలు మరింత బలోపేతం అయ్యాయి. సాధారణంగా ఒక దేశంలో ప్రభుత్వాలు మారినప్పుడు..ఆ ప్రభావం దౌత్య పరంగానూ కనిపిస్తుంటుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోనూ ప్రభుత్వం మారిన తరుణంలో భారత్ తో ఇకపై సంబంధాలు ఎలా ఉండనున్నాయనే సందేహాలు తలెత్తుతున్నాయి. దాదాపు 40 ఏళ్లుగా ఆస్ట్రేలియాతో బంధం కొనసాగిస్తున్న భారత్ తో ఇకపై యధావిధిగా సత్సంబంధాలు కొనసాగేనా? ప్రధానంగా క్వాడ్ కూటమిలో ఆస్ట్రేలియా – భారత్ భాగస్వామ్యం, ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఎలా ఉండనున్నాయనేది..ఆసక్తికరంగా మారింది.

Other Stories:Monkeypox : ఇజ్రాయెల్‌లో మొదటి మంకీపాక్స్ కేసు.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త..!

ప్రధానిగా స్కాట్ మోరీసన్ ఆస్ట్రేలియా – భారత్ మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేశారు. కరోనా సమయంలో చైనాపై దుమ్మెత్తిపోసిన ఆస్ట్రేలియా..ఆమేరకు ఆ దేశంతో తమకున్న వాణిజ్య దౌత్య సంబంధాలను పాక్షికంగా తెగతెంపులు చేసుకుంది. చైనా వస్తువులపై ఎక్కువగా ఆధారపడ్డ ఆస్ట్రేలియా..వస్తు ఉత్పత్తిలో అవాంతరాలు ఎదురుకాకుండా ఆమేరకు భారత్ తో వాణిజ్య బంధాలను మరింత బలోపేతం చేసుకుంది. అంతేకాదు..ఆస్ట్రేలియా – భారత్ మధ్య మరో ముఖ్యమైన అంశం ‘ఇమ్మిగ్రేషన్’. భారత్ నుంచి వలసవెళ్లే వేలాది మంది టెక్ ఉద్యోగులు, ఇతర వలస కార్మికులు ఆస్ట్రేలియాలో తమ ప్రతిభకు గుర్తింపు తెచ్చుకున్నారు. భారతీయ మానవ వనరులపై ఆధారపడ్డ ఆస్ట్రేలియాలో ఇప్పుడు భారతీయులు అధిక సంఖ్యలో నివాసాలు ఏర్పరుచుకున్నారు.

ప్రభుత్వ, పాలనా పరంగా ఇదంతా ఎలా ఉన్నా..దౌత్య పరంగా ఇరు దేశాలు దృడంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరోవైపు ప్రధానిగా భాద్యతలు స్వీకరించనున్న ఆంటోనీ అల్బనీస్ కు భారత్ తో సంబంధాలపై మంచి అవగాహనా ఉంది. “ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా ఎన్నికైన ఆంథోనీ అల్బనీస్ 1991లో బ్యాక్‌ప్యాకర్‌గా భారత దేశంలో పర్యటించారు. 2018లో పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన అంథోని భారతదేశానికి కొత్తేమీ కాదు. ప్రచార సమయంలో అతను ఆర్థిక, వ్యూహాత్మక మరియు ప్రజల మధ్య సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి కట్టుబడి ఉన్నాడు,” అని ఆస్ట్రేలియా హై కమిషన్ బారీ ఓ’ఫారెల్ ఏఓ తెలిపారు. ఏప్రిల్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు స్కాట్ మారిసన్ సమక్షంలో ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారం మరియు వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

Other Stories:Imran Khan: భారత్‌ను పొగడ్తలతో ముంచెత్తిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్.. అసలు విషయం ఏమిటంటే..

ఆస్ట్రేలియా నుంచి భారత్ దిగుమతి చేసుకునే 85 శాతం కంటే ఎక్కువ ఆస్ట్రేలియన్ వస్తువులపై సుంకాలు తొలగించబడ్డాయి. అదే సమయంలో యోగా ఉపాధ్యాయులతో సహా విద్యార్థులు మరియు నిపుణుల కోసం వీసా నిబంధనలు సరళీకృతం చేయబడ్డాయి. ఉక్కు, అల్యూమినియం మరియు టెక్స్‌టైల్ పరిశ్రమలలో వినియోగించే చౌకైన ముడి పదార్థాలను ఆస్ట్రేలియా నుంచి భారత్ దిగుమతి చేసుకోనుంది. ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత 97 శాతం భారతీయ వస్తువులు వెంటనే ఆస్ట్రేలియాకు ప్రాధాన్యతనిస్తాయని, మిగిలినవి వచ్చే ఐదేళ్లలో జరుగుతాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ప్రభుత్వం మారినా..ఆ ప్రభావం భారత్ పై ఎంత మాత్రం ఉండబోదని విదేశాంగశాఖ నిపుణులు అంటున్నారు. పైగా ప్రధానిగా అంథోని భారత్ కు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది.

×