జవాన్లకు ఐదేళ్ల బాలుడి సెల్యూట్ : viral Video

  • Published By: nagamani ,Published On : November 16, 2020 / 11:58 AM IST
జవాన్లకు ఐదేళ్ల బాలుడి సెల్యూట్ : viral  Video

Ladakh : five years old LkG kid selute : LKG చదువుతున్న ఐదు సంవత్సరాల పిల్లాడు ఆర్మీకి చేసిన సెల్యూట్ వైరల్ గా మారింది. ఆ బాబు పేరు నవాంగ్ నంగ్యాల్. అంత చిన్న వయస్సులోనే ఆర్మీకి ఆ బాలుడు చేసిసి సెల్యూట్ కు ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్(ఐటీబీపీ) ఫిదా అయిపోయింది. ఆ బాలుడ్ని సత్కరించింది.



లడఖ్ ప్రాంతానికి చెందిన నవాంగ్, ఛుల్సుల్ ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన వాడు నవాంగ్ నంగ్యాల్. గత అక్టోబర్ లో నవాంగ్ నంగ్యాల్ జవాన్లకు సెల్యూట్ చేస్తుండగా తీసిన వీడియో బైటపడింది. అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఐటీబీపీ నవాంగ్ ను సత్కరించాలని భావించింది.
https://10tv.in/this-kid-stole-my-heart-says-trs-working-president-minister-ktr/


అతని సైజ్ కు సరిపడా ఐటీబీపీ యూనిఫామ్ ను కుట్టించింది. ఆ బాలుడికొ తొడిగింది. అంతేకాదు ఆ ఐదేళ్ల పిల్లాడిని డ్రిల్ క్యాంప్ లో పాల్గొనే అవకాశాన్ని కూడా కల్పించింది. ఇంత చిన్న వయస్సులోనే దేశ గురించి ఆర్మీచేసే సేవల గురించి ఆ చిన్నారి చేసిన సెల్యూట్ మరింత మందికి ఆదర్శంగా నిలవాలని ఐటీబీపీ కోరుకుంది. ప్రత్యేక డ్రస్ లో సెల్యూట్ చేస్తున్న వీడియోను ఐటీబీపీ తమ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.