Highest Theatre: మైనస్ 28 డిగ్రీస్‌.. 11,562 అడుగుల ఎత్తులో మూవీ థియేటర్!

సముద్ర మట్టం నుండి 11,562 అడుగుల ఎత్తులో ఓ కొండపైన మూవీ థియేటర్ ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఏర్పాటైన థియేటర్ కాగా..

Highest Theatre: మైనస్ 28 డిగ్రీస్‌.. 11,562 అడుగుల ఎత్తులో మూవీ థియేటర్!

Highest Theatre

Highest Theatre: సముద్ర మట్టం నుండి 11,562 అడుగుల ఎత్తులో ఓ కొండపైన మూవీ థియేటర్ ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఏర్పాటైన థియేటర్ కాగా అక్కడ ఉష్ణోగ్రత మైనస్ 28 డిగ్రీలు కావడం గమనార్హం. నిజానికి ఇలాంటి చోట మనిషి మామూలుగా బతకడమే కష్టం కాగా అక్కడ థియేటర్ ఏర్పాటు చేసి ఔరా అనిపించారు. ఈ అద్భుతం చోటు చేసుకున్నది ఇండియాలోనే కావడం విశేషం.

ల‌ఢ‌క్‌ లోని లేహ్ లో కొండ మీద పిక్స‌ర్ టైమ్ డిజిప్లెక్స్ అనే సంస్థ‌ అక్క‌డ మొబైల్ థియేట‌ర్‌ను ఏర్పాటు చేసింది. రిమోట్ ప్రాంతాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌కు సినిమా థియేట‌ర్ అనుభ‌వాన్ని అందించ‌డం కోసం ఈ ప్రయోగం చేపట్టగా.. థియేటర్ లిప్ మొదలుగా ఎకూల్ (ekool) అనే షార్ట్ ఫిల్మ్ ప్ర‌ద‌ర్శించారు. ల‌ఢ‌క్ ప్రాంతంలో నివ‌సించే చాంగ్‌పా అనే సంచారజాతి మ‌నుషుల ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమాను సైనికుల కొసం ప్రదర్శించారు.

కాగా, ఆ తర్వాత ఈ థియేటర్లో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన బెల్ బాటమ్ సినిమాను ప్రదర్శించారు. అంతేకాదు త్వ‌ర‌లోనే ల‌ఢ‌క్ ప్రాంతంలో మ‌రిన్ని మొబైల్ థియేట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తామ‌ని పిక్స‌ర్ టైమ్ డిజిప్లెక్స్ సంస్థ వెల్ల‌డించింది. గాలితో నింపిన మెటీరియ‌ల్ ఉప‌యోగించి ఈ థియేట‌ర్‌ను నిర్మించగా.. ఇది పూర్తిగా వాట‌ర్ ప్రూఫ్ థియేట‌ర్. అక్క‌డ టెంప‌రేచ‌ర్ మైన‌స్ డిగ్రీల‌కు ప‌డిపోయినా కూడా ఆ థియేట‌ర్ చెక్కు చెద‌ర‌కుండా.. లోపల ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది కూడా లేకుండా మూవీ అనుభూతిని అందిస్తుందని పిక్చర్ టైం చెప్తుంది.