Highest Road : లడఖ్‌లో ప్రపంచంలోనే ఎత్తైన రహదారిని ప్రారంభించిన ఎంపీ

లడఖ్‌లో ఇండియన్ ఆర్మీ నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారి అందుబాటులోకి వచ్చింది. ఈ రహదారి వల్ల లేహ్‌ నుంచి చైనా సరిహద్దులోని పాంగాంగ్ సరస్సు వరకు సులభంగా చేరుకోవచ్చు.

Highest Road : లడఖ్‌లో ప్రపంచంలోనే ఎత్తైన రహదారిని ప్రారంభించిన ఎంపీ

Highest Road

Highest Road In Ladakh : అందాల చల్లచల్లని లడఖ్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారి అందుబాటులోకి వచ్చింది.ఇండియాన్ ఆర్మీ నిర్మించిన ఈ రహదారి అందుబాటులోకి రావడంతో లేహ్‌ నుంచి చైనా సరిహద్దులోని పాంగాంగ్ సరస్సు వరకు చాలా సులభంగా చేరుకోవచ్చు. 18,600 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ రహదారి ఇది.

ఈ రహదారి లేహ్ (జిగ్రాల్-టాంగ్సే) నుంచి బనానాపాస్‌ను దాటుతుంది. ఈ రోడ్డు కారణంగా పాంగాంగ్ సరస్సుకు వెళ్లే దూరం 41 కి.మీ దూరం తగ్గతుంది. ఈ రోడ్డును భారత ఆర్మీ 58 ఇంజనీర్ రెజిమెంట్ నిర్మించింది. సాధారణ ప్రజల కోసం ఈ రహదారిని లడఖ్‌కు చెందిన బీజేపీ ఎంపీ జంయాంగ్ ట్సెరింగ్ నామ్‌గ్యాల్ ప్రారంభించారు. ఇప్పటి వరకు ఖార్దుంగ్లా పాస్ 18,380 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే ఎత్తైన రహదారిగా ఉన్నది. ఇప్పుడు ఆ రహదారి రికార్డును 18,600 అడుగుల ఎత్తులో నిర్మించిన లఢక్ రహదారి బ్రేక్ చేసింది.

ఈ రహదారిని ప్రారంభించిన సందర్భంగా ఎంపీ మాట్లాడుతు..పర్యాటక కోణంలోచూస్తే ఈ రహదారి చాలా ముఖ్యమైనదని..ఇది భవిష్యత్‌లో స్థానిక నివాసితుల సామాజిక, ఆర్ధిక స్థితిగతులను పెంపొందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిపారు.ముఖ్యంగా లడఖ్‌లోని లలోక్ ప్రాంతంలోని ప్రజలకు ఇది పర్యాటక సౌకర్యాన్ని కల్పిస్తుందని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉండే అత్యంత అరుదైన అద్భుతమైన ఔషధ మొక్కలను సందర్శించడానికి, స్నో స్పోర్ట్స్ వంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అలాగే నిరంతరం సంచార జీవితాన్ని గడిపే జంతువులను చూడటానికి ఇక్కడ అందమైన సరస్సులు, ఇతర ఆకర్షణలను చూడటానికి పర్యాటకులకు ఈ రోడ్డు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంపీ నామ్‌గ్యాల్ అన్నారు.

రహదారి ప్రారంభం కార్యక్రమంలో లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్, 14 వ కార్ప్స్ కమాండింగ్ జనరల్ ఆఫీసర్ తాషి నామ్‌గ్యాల్ యాక్జీ, స్టాన్జిన్ చోస్పెల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ వేన్ లామా కొంచోక్ సెఫెల్‌తోపాటు లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.