Ladakh Standoff : లడఖ్ సరిహద్దుల్లో డ్రాగన్ దుస్సాహసం..కొత్త హైవేలు,శాటిలైట్లకు దొరక్కుండా స్థావరాలు!

వాస్తవాధీన రేఖ(LAC) వెంబడి సైనిక మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం కోసం చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. తూర్పు లడఖ్ లో వాస్తవాధీన రేఖ వెంబడి ఏరియాల్లో చైనా కొత్త హైవేలను

Ladakh Standoff : లడఖ్ సరిహద్దుల్లో డ్రాగన్ దుస్సాహసం..కొత్త హైవేలు,శాటిలైట్లకు దొరక్కుండా స్థావరాలు!

Ladakh

Ladakh Standoff:   వాస్తవాధీన రేఖ(LAC) వెంబడి సైనిక మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం కోసం చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. తూర్పు లడఖ్ లో వాస్తవాధీన రేఖ వెంబడి ఏరియాల్లో చైనా కొత్త హైవేలను నిర్మిస్తోందని,రోడ్లను కనెక్ట్ చేయడం,కొత్త ఆవాసాలు మరియు నివాసాలను నిర్మిస్తోందని,కొత్త ఎయిర్‌స్ట్రిప్‌లను నిర్మిస్తోందని సమాచారం. అంతేకాకుండా క్షిపణి రెజిమెంట్‌లతో సహా భారీ ఆయుధాలను ఎల్ఏసీ వద్ద చైనా మోహరించినట్లు సమాచారం.

కష్గర్, గర్ గున్సా మరియు హోటాన్‌లోని ప్రధాన స్థావరాల్లోనే కాకుండా హైవేలను విస్తరిస్తోందని,కొత్త ఎయిర్‌స్ట్రిప్‌లను నిర్మిస్తోందని, చైనా సైనిక మౌలిక సదుపాయాల అప్ గ్రేడ్ చాలా ముఖ్యమైన విషయంగా భావించాలని నిఘా వర్గాలు తెలిపాయి. ఒక పెద్ద విశాలమైన హైవే కూడా అభివృద్ధి చేయబడుతోందని, ఇది లోతట్టు ప్రాంతాలతో LACలో చైనా సైనిక స్థావరాల కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తుందని తెలిపాయి. లోతైన ప్రాంతాలలో అమెరికన్ మరియు ఇతర శాటిలైట్ల కంట కనబడకుండా తప్పించుకునేలా చైనా మిలటరీ… తన ఎయిర్ ఫోర్స్, సైన్యం కోసం మౌలిక సదుపాయాలను నిర్మించడంపై దృష్టి సారించిదని తెలిపాయి.

టిబెట్ లోని చైనా నియంత్రణలో ఉన్న వెనుక ప్రాంతాలలో రాకెట్లు మరియు క్షిపణి రెజిమెంట్‌లను కూడా చైనా ఆర్మీ మోహరించినట్లు సమాచారం. అంతేకాకుండా,చైనా బలగాలకు మనుగడ చాలా కష్టంగా ఉన్న అత్యంత కష్టతరమైన భూభాగంలో మట్టి పుత్రులను ఉపయోగించుకోవాలని వారు(చైనా) కోరుకుంటున్నారని,ఈ కారణంతోనే టిబెటన్లను చైనా ఆర్మీ రిక్రూట్ చేసుకుంటోందని మరియు ప్రధాన భూభాగంలోని హాన్ దళాలతో పాటు సరిహద్దు పోస్ట్‌లలో వారిని ఉంచే ప్రయత్నాలు కూడా వేగం పుంజుకుంటున్నాయని తెలిపాయి. గత ఏడాది చలికాలంతో పోలిస్తే.. షెల్టర్లు, రోడ్ కనెక్టివిటీ,అలవాటు పరంగా చైనా బలగాలు ఈ సారి మరింత సిద్ధంగా ఉన్నారని సమాచారం. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో సరిహద్దులో నిఘా కోసం డ్రోన్లను చైనా మొహరించినట్లు తెలుస్తోంది.

తూర్పు లడఖ్ సెక్టార్ ఎదురుగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(PLA లేదా చైనా ఆర్మీ)చర్యలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. రెండు దేశాల మధ్య ఇటీవల జరిగిన చర్చల సందర్భంగా.. తూర్పు లడఖ్ సెక్టార్ సమీపంలోని ప్రాంతాల్లో చైనా చేపడుతున్న నిర్మాణాలపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాంతంలో చైనా ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే ఎదుర్కోవడానికి భారత్ కూడా సిద్ధంగా ఉంది. భారత్ కూడా గతేడాది కంటే ఈసారి మరింత సిద్ధంగా ఉందని వర్గాలు తెలిపాయి.

ALSO READ Aircraft : అంటార్కిటికా గడ్డపై కొత్త చరిత్ర..తొలిసారిగా మంచుపై ల్యాండ్ అయిన విమానం