Lakhimpur Kheri Violence: వేరే కేసులు తీసుకోకుండా, వాయిదా వేయకుండా కేవలం లఖింపూర్ కేసు విచారణకే ఐదేళ్లు పడుతుందట!
సుప్రీం అడిగిన ప్రశ్నకు సెషన్స్ కోర్టు ఇచ్చిన వివరణను న్యాయమూర్తులు ప్రస్తావిస్తూ, విచారణ పూర్తి కావడానికి కనీసం ఐదేళ్లు పట్టవచ్చని సెషన్స్ జడ్జి తెలియజేశారని పేర్కొన్నారు. రైతులపై కారు తోలిన ముగ్గురు వ్యక్తులను ఆందోళనకారులు కొట్టిచంపిన మరో కేసులో నిందితులు నలుగురు ఇప్పటికీ కస్టడీలోనే ఉన్నారా అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది

Lakhimpur Kheri violence hearing to take 5 years, says Supreme Court
Lakhimpur Kheri Violence: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరి జిల్లాలోని రైతులపై జీప్ ఎక్కించడంతో ఎనిమిది మంది మృతి చెందిన కేసు గురించి తెలిసిందే. ఈ కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రధాన దోషిగా ఉన్నారు. అయితే ఈ కేసు విచారణకు పట్టే సమయం గురించి ఈ కేసును విచారిస్తున్న సెన్షన్స్ జడ్జి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వేరే ఏ కేసు తీసుకోకుండా, అలాగే ఈ కేసును వాయిదా వేయకుండా, సవ్యంగా ఏకబిగిన విచారణ జరపడానికి ఐదేళ్ల సమయం పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
2021 అక్టోబర్‌లో నిరసన తెలుపుతున్న రైతులపై కారు నడిపి, ఎనిమిది మంది మృతికి కారణమైన ఆశిష్ మిశ్రా.. తనకు బెయిల్ కావాలంటూ వేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు ఇటీవల తోసిపుచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయమూర్తులు సూర్యకాంత్, వి.సుబ్రమణియన్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. వేరే ఇతర కేసులు ఏవీ తీసుకోకుండా, కోర్టు ప్రాధాన్యతాంశాలను వాయిదా వేయకుండా సాధారణ క్రమంలో కేసు విచారణ జరిపితే, అది పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందని గత నెలలో సెషన్స్ కోర్టును సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
Tamil Nadu: తమిళనాడు గవర్నర్‌ను సమర్ధించనూ లేక, విమర్శించనూ లేక సతమతమవుతోన్న బీజేపీ
సుప్రీం అడిగిన ప్రశ్నకు సెషన్స్ కోర్టు ఇచ్చిన వివరణను న్యాయమూర్తులు ప్రస్తావిస్తూ, విచారణ పూర్తి కావడానికి కనీసం ఐదేళ్లు పట్టవచ్చని సెషన్స్ జడ్జి తెలియజేశారని పేర్కొన్నారు. రైతులపై కారు తోలిన ముగ్గురు వ్యక్తులను ఆందోళనకారులు కొట్టిచంపిన మరో కేసులో నిందితులు నలుగురు ఇప్పటికీ కస్టడీలోనే ఉన్నారా అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. కేసు తదుపరి విచారణను జనవరి 19వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం ఈ కేసులో 208 మంది ప్రాసిక్యూషన్ సాక్షులు, 171 డాక్యుమెంట్లు, 27 ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నివేదికలు ఉన్నట్టు అత్యున్నత న్యాయస్థానానికి రాసిన లేఖలో సెషన్స్ జడ్జి తెలిపారు.