Lakhimpur Violence : కేంద్రమంత్రి కుమారుడితో సీన్ రీకనస్ట్రక్షన్

దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖింపూర్ ఖేరీ ఘటనపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)...గురువారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా సహా

Lakhimpur Violence : కేంద్రమంత్రి కుమారుడితో సీన్ రీకనస్ట్రక్షన్

Up (7)

Lakhimpur Violence  దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖింపూర్ ఖేరీ ఘటనపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)…గురువారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా సహా ఈ కేసులో అరెస్ట్ చేసిన నలుగురిని గురువారం సీన్ రీకనస్ట్రక్షన్ కోసం సంఘటనా స్థలానికి తీసుకెళ్లింది.

అక్టోబర్ 3న రెండు కార్లు వేగంగా వెళ్లి రైతులను ఎలా ఢీకొట్టాయే..ఆ సీన్ ని తిరిగి సృష్టించడానికి మూడు ఎస్ యూవీ కార్లను మరియు డమ్మీలను సిట్ వినియోగించింది. ఈ కేసులో నలుగురు నిందితుల స్టేట్‌మెంట్‌లను సిట్.. క్రాస్ చెక్ చేసింది. సీన్ రీకనస్ట్రక్షన్ సమయంలో..లక్నో ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ బృందం కూడా సిట్ తో పాటు ఉంది. స్పాట్ లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF)తో పాటు ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కాన్స్టాబులరీ (PAC) కూడా మోహరించబడింది.

ఈ కేసులో ఆశిష్ మిశ్రాతో పాటు సహ నిందితుడిగా ఉన్న అంకిత్‌ దాస్‌ పోలీసు విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. రైతులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని , వాళ్ల మీదకు కాన్వాయ్‌ దూసుకెళ్లాలని ఆశిష్ మిశ్రా డ్రైవర్‌ను ఆదేశించాడని అంకిత్‌దాస్‌ సిట్‌ విచారణలో తెలిపాడు.

అయితే రైతులను ఢీకొట్టిన తరువాత జీపు బోల్తా పడిందని.. డ్రైవర్‌ను ను అక్కుడున్న రైతులు బయటకు లాగి చంపేశారని అంకిత్‌ దాస్‌ తెలిపాడు. ప్రాణరక్షణ కోసమే తాను కాల్పులు జరిపినట్టు అంకిత్‌ దాస్‌ తెలిపాడు. అయితే లఖింపూర్‌ ఘటన జరిగినప్పుడు తాను అక్కడ లేనని ,వేరే ప్రాంతంలో ఉన్నట్టు వాదిస్తున్నాడు ఆశిష్ మిశ్రా. కాగా, ఆశిష్ మిశ్రా మూడు రోజుల పోలీస్‌ రిమాండ్‌ గురువారంతో ముగియనుంది.

అక్టోబర్​ 3న లఖింపుర్​ ఖేరిలో జిల్లాలో యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య,కేంద్రహోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా పర్యటన నేపథ్యంలో హింస చెలరేగిన విషయం తెలిసిందే. టికునియా-బన్​బీర్​పుర్​ సరిహద్దు వద్ద సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులపైకి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రా తనయుడు ఆశిష్‌ మిశ్రా కారు, మరో వాహనం దూసుకెళ్లాయి. ఈ ఘటనలో నలుగురు రైతులు అక్కడికక్కడే మరణించగా.. అనంతరం జరిగిన హింసలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్‌, ముగ్గురు బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్​). ఆశిష్ మిశ్రా మరియు అతని స్నేహితుడు అంకిత్ దాస్, గన్ మ్యాన్ లతీఫ్ మరియు డ్రైవర్ శేఖర్ భారతిని సిట్ అరెస్ట్ చేసింది.