Lakhimpur Kheri Violence : ఇద్దరు బీజేపీ కార్యకర్తలు అరెస్ట్..కేంద్రమంత్రి కుమారుడికి సమన్లు

లఖింపూర్ ఖేరి జిల్లాలో ఆదివారం చోటు చేసుకున్న హింసాత్మక ఘటన కేసులో అరెస్ట్ ల పర్వం ప్రారంభమైంది.

Lakhimpur Kheri Violence : ఇద్దరు బీజేపీ కార్యకర్తలు అరెస్ట్..కేంద్రమంత్రి కుమారుడికి సమన్లు

Up (6)

Lakhimpur Kheri Violence లఖింపూర్ ఖేరి జిల్లాలో ఆదివారం చోటు చేసుకున్న హింసాత్మక ఘటన కేసులో అరెస్ట్ ల పర్వం ప్రారంభమైంది. ఈ ఘటనకు సంబంధించి లవకుశ, ఆశిష్ పాండే అనే ఇద్దరు వ్యక్తులను గురువారం ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. లఖింపూర్ ఖేరి జిల్లాలో ఆదివారం రైతులను తొక్కుకుంటూ వెళ్లిన మంత్రుల కాన్వాయ్ లో కారులో వీరిద్దరూ ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఈ ఇద్దరూ బీజేపీ కార్యకర్తలుగా, కేంద్ర మంత్రి ఆశిష్ మిశ్రా కుటుంబానికి అనుచరులుగా కొనసాగుతున్నారు.

ఈ కేసులో నిందితుల అరెస్టులు ఎంత దాకా వచ్చాయని గురువారం సుప్రీంకోర్టు యూపీ సర్కారును నిలదీన గంటల వ్యవధిలోనే తొలి అరెస్టు చోటుచేసుకోవడం గమనార్హం. లఖింపూర్ ఘటన దర్యాప్తుపై శుక్రవారం నాటికి సుప్రీంకోర్టుకు స్టేటస్ రిపోర్టు సమర్పించాల్సి ఉండగా, తాజా అరెస్టులు కీలకంగా మారాయి. రాబోయే రోజుల్లో ఈ కేసుకి సంబంధించి మరిన్ని అరెస్టులు ఉంటాయని యూపీ పోలీసు వర్గాలు చెబుతున్నాయి

మరోవైపు, లఖింపూర్ హింసాకాండలో ప్రధాన ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా థేనీ కుమారుడు ఆశిష్ మిశ్రా ఎక్కడున్నాడనేది ఇంకా వెల్లడికాలేదు. రైతుల మరణాలకు దారి తీసిన కాన్వాయ్ లో భాగం పంచుకున్న ఇద్దరు నిందితులుగా లవకుశ, ఆశిష్ పాండేల పేర్లను పేర్కొన్న పోలీసులు.. సదరు వాహనాల యజమాని అయిన కేంద్ర మంత్రి కొడుకును మాత్రం ఇంకా పట్టుకోలేదు. విచారణకు హాజరుకావాలంటూ ఆశిష్ మిశ్రాకు సమన్లు జారీ చేసినట్లు లక్నో ఐజీ లక్ష్మీ సింగ్ తెలిపారు.

ఇక, మరోవైపు,లఖింపూర్ ఘటనపై దర్యాప్తు కోసం ఏకసభ్య జ్యుడిషియల్ ను యూపీ ప్రభుత్వం నియమించింది. రిటైర్ట్ అలహాబాద్ హైకోర్టు జడ్జి ప్రదీప్ కుమార్ శ్రీవాత్సవ ఈ కమిషన్ లో సభ్యుడు.

ALSO READ  Lakhimpur Kheri Violence : శుక్రవారంలోగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలి..యోగి సర్కార్ కు సుప్రీం ఆదేశం

ALSO READ