Gujarat: మాజీ సర్పండ్ మేనల్లుడి వివాహం.. గాల్లోకి రూ.లక్షల నోట్ల కట్టలు విసురుతూ సంబరాలు

పెళ్లి ఆనందంలో బరాతీలు, బంధువులు ఇంటి బాల్కనీపై నిలబడి నోట్లను గాల్లోకి ఎగరేయడం ప్రారంభించారు. 10 రూపాయల నోట్ల నుంచి 500 రూపాయల నోట్ల వరకు పెద్ద ఎత్తున ఎగజల్లారు. వివాహ వేడుకల సందర్భంగా గ్రామంలోనే ఊరేగింపు నిర్వహించారు. అదే సమయంలో జరిగిన సంఘటన ఇది. కరీంభాయ్ తన కుటుంబ సభ్యులతో టెర్రస్‌పైకి చేరుకుని నోట్ల వర్షం కురిపించాడు.

Gujarat: మాజీ సర్పండ్ మేనల్లుడి వివాహం.. గాల్లోకి రూ.లక్షల నోట్ల కట్టలు విసురుతూ సంబరాలు

Lakhs of rupees from 10 to 500 rained, there was competition among the collectors

Gujarat: ప్రతి ఒక్కరూ తమ వివాహాన్ని గుర్తుండిపోయేలా చేయడానికి కొత్త మార్గాలను అనుసరిస్తారు. ఇదైతే ప్రస్తుతం మాంచి ట్రెండింగులో ఉంది కూడా. భిన్నమైన ఫొటో షూట్లు లేదంటే, ప్రత్యేకమై ప్రదేశాల్లో పెళ్లిమండపం ఏర్పాటు, భిన్న పద్దతుల్లో పెళ్లి, భిన్నమైన బట్టలు.. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు చేసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం రాజ్‌కోట్‌లో రాజ్‌పుత్ కమ్యూనిటీ వివాహంలో వధువును తీసుకెళ్లడానికి అత్తమామలు హెలికాప్టర్‌లో వచ్చారు. ఇందుకోసం పాలనాధికారి నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి వచ్చిందనుకోండి. అయితే ఆ పెళ్లి మాత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చెప్పుకుంటూ పోతే, ఈ మధ్య కాలంలో ఇలాంటివి అనేకం ఉన్నాయి.

Delhi Liquor Scam: విచారణకు హాజరుకాలేనన్న సిసోడియా.. సరేనన్న సీబీఐ

ఇక ఈమధ్య గుజరాత్‌లో జరుగుతున్న పెళ్లిళ్లలో ఏదో ఒక సంఘటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కొన్ని ఆశ్చర్యకరమైన ఘటనలు జరుగుతుండగా కొన్ని బాధాకరమైన ఘటనలు కూడా జరుగుతున్నాయి. ఆ మధ్య ఓసారి దళిత యువకుడు గుర్రంపై ఊరేగాడని దాడికి పాల్పడ్డ దుర్మార్గ ఘటన దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఇక తాజాగా మెహసానాలో జరిగిన ఓ పెళ్లి సన్నివేశం సైతం చర్చల్లోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ నెటిజెన్లకు ఆకట్టుకుంటున్నాయి.

వివాహ వేడుకల్లో బరాత్ తీయడం తెలిసిందే. ఆ సమయంలో కుటుంబ సభ్యుల, బంధువులు నోట్లను ఎగరేయడం సాధారణంగా జరిగేదే. అయితే మెహసానాలో జరిగిన పెళ్లి వేడుకలో ఏకంగా నోట్ల వర్షం కురిసింది. పదులు, వందలు, ఐదు వందల నోట్లు గాళ్లో కుప్పలు తెప్పలుగా ఎగిరాయి. పెళ్లికి వచ్చిన వారు వాటిని అందుకోవడానికి ఎగబడ్డారు. ఈ సందర్భంగా కొందరి మధ్య తోపులాట కూడా జరిగింది. నోట్ల వర్షం కురిపిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Asaduddin Owaisi: అయితే నన్ను చంపుతారా?.. కర్ణాటక సీఎం బొమ్మైకి అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్న

మెహసానా జిల్లాలోని అగోల గ్రామ మాజీ సర్పంచ్ కరీంభాయ్ దాదుభాయ్ జాదవ్ మేనల్లుడి వివాహం ఫిబ్రవరి 16న జరిగింది. పెళ్లి ఆనందంలో బరాతీలు, బంధువులు ఇంటి బాల్కనీపై నిలబడి నోట్లను గాల్లోకి ఎగరేయడం ప్రారంభించారు. 10 రూపాయల నోట్ల నుంచి 500 రూపాయల నోట్ల వరకు పెద్ద ఎత్తున ఎగజల్లారు. వివాహ వేడుకల సందర్భంగా గ్రామంలోనే ఊరేగింపు నిర్వహించారు. అదే సమయంలో జరిగిన సంఘటన ఇది. కరీంభాయ్ తన కుటుంబ సభ్యులతో టెర్రస్‌పైకి చేరుకుని నోట్ల వర్షం కురిపించాడు.