RJD Chief : ఆరేళ్ల తర్వాత ఎన్నికల ర్యాలీలో లాలూ..అప్పుడే వచ్చుంటే తేజస్వీ ఎప్పుడో సీఎం

ఆరేళ్ల విరామం తర్వాత తొలిసారిగా ఇవాళ ఎన్నికల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌. ఈ నెల 30న బీహార్ లో ఉప ఎన్నికలు

RJD Chief : ఆరేళ్ల తర్వాత ఎన్నికల ర్యాలీలో లాలూ..అప్పుడే వచ్చుంటే తేజస్వీ ఎప్పుడో సీఎం

Lalu

RJD Chief ఆరేళ్ల విరామం తర్వాత తొలిసారిగా ఇవాళ ఎన్నికల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌. ఈ నెల 30న బీహార్ లో ఉప ఎన్నికలు జరుగనున్న తారాపూర్‌, కుశ్వేశ్వర్ ఆస్థాన్‌ నియోజకవర్గాల్లో చివరి రోజున(అక్టోబర్-27)ఎన్నికల ప్రచారం నిర్వహించారు లాలూ. బుధవారం ఈ రెండు నియోజకవర్గాల్లో హెలీకాప్టర్‌లో పర్యటించి స్థానిక ప్రజలనుద్దేశించి మాట్లాడిన లాలూ..నితీష్ కుమార్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

బీహార్ లో నిరుద్యోగం, అవినీతి అనేక రెట్లు పెరిగిపోయాయని..అయితే ఈ సమస్యల పరిష్కారానికి నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏమీ చేయలేదని మండిపడ్డారు. బీహార్‌లో ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వం అని పిలిచే బీజేపీ, రాష్ట్రం, కేంద్రంలో వేర్వేరు దిశల్లో ఇంజిన్‌లను లాగడం వల్ల అన్ని రంగాలలో ప్రభుత్వం విఫలమైందని లాలు విమర్శించారు. గతంలో నితీష్ కుమార్..తాను చావనైనా చస్తాను కానీ బీజేపీలో చేరను అని అన్నాడని..కానీ ఇప్పుడు మళ్లీ తిరిగి అదే బీజేపీతో చేతులు కలిపాడని లాలూ అన్నారు. బీజేపీలో చేరనంటూనే ఆ పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఎం నితీశ్‌ బీహర్‌కు ప్రత్యేక హోదాను తీసుకురాలేకపోయారంటూ మండిపడ్డారు.

తాను జైలు నుంచి విడుదలై ఉంటే బీహార్‌లో తేజశ్వి ప్రభుత్వం ఏర్పడి ఉండేదని లాలూ అన్నారు. బీహార్ ప్రజలు తేజశ్విని ముఖ్యమంత్రిగా నిర్ణయించుకున్నారు. అయితే మోసం, అవకతవకల ద్వారా నితీష్ కుమార్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. తాను జైళ్లో కాకుండా బయట ఉండి ఉంటే ఇలా జరిగేది కాదని తారాపూర్‌లోని ఈద్గా మైదాన్‌లో స్థానికుల కరతాళధ్వనుల మధ్య లాలూ మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిమజ్జనం ఇస్తామని తాను చెప్పానని..అయితే తాను నితీష్ కుమార్ ని కాల్చివేస్తాను అంటూ నితీష్ చెబుతున్నాడని..అయితే తాను నితీష్ ను చంపనని..తనకు తానుగానే నితీష్ చనిపోతాడంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. బీహార్ లో మద్యం అమ్మకాల నిషేధంపై మాట్లాడుతూ..బీహార్‌లో ఎలుకలు మద్యం తాగుతాయిని లాలు ఎద్దేవా చేశారు.

మరోవైపు,బీహార్‌లోని విపక్ష మహా కూటమిలో చిక్కులు తలెత్తిన నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఇవాళ కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో ఫోన్ లో మాట్లాడారు. అయితే, ఇద్దరి మధ్య సంభాషణల వివరాలు మాత్రం వెల్లడి రాలేదు. కుషేశ్వర్ ఆస్థాన్, తారాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి మధ్య తెగతెంపులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీనికి ముందు, బీహార్‌లో కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగిస్తే ఆర్జేడీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని లాలూ పేర్కొన్నారు. అయితే తాజాగా దీనిపై ఆయన మరింత వివరణ ఇస్తూ, జాతీయ స్థాయి రాజకీయాల్లో బీజేపీకి బలమైన ప్రత్యర్థి కాంగ్రెస్సేనని, తమ పార్టీ ఎప్పుడూ కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తుందని చెప్పారు.