Lalu Yadav : పాత జీపులో..పట్నా వీధుల్లో లాలూ షికార్లు

  ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ బుధవారం పట్నా వీధుల్లో కారు నడుపుతూ కనిపించారు. దాణా కుంభకోణం కేసుకి సంబంధించి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరయ్యేందుకు

10TV Telugu News

Lalu Yadav  ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ బుధవారం పట్నా వీధుల్లో కారు నడుపుతూ కనిపించారు. దాణా కుంభకోణం కేసుకి సంబంధించి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరయ్యేందుకు నగరానికి వచ్చిన ఆయన..ఏళ్ల క్రితం తొలిసారి ముచ్చటపడి కొనుక్కున్న తెలుపురంగు ఓపెన్​ టాప్ జీపును బయటకు తీసి పాట్నా వీధుల్లో ఉల్లాసంగా డ్రైవ్ చేస్తూ వివహరించారు. లాలూ ఓ ప్రాంతానికి చేరుకోగానే ఆయనను చూసి ఆశ్చర్యానికి గురైన ప్రజలు..లాలూ యాదవ్​ జిందాబాద్​ అని నినాదాలు చేస్తూ మద్దతు తెలిపారు.

ఈ వీడియోను లాలూ ట్విట్టర్​లో షేర్​ చేశారు.”చాలా ఏళ్ల తరువాత నా మొదటి వాహనం నడిపాను. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో డ్రైవర్ ​గా మారుతారు. ప్రేమ, సామరస్యం, సమానత్వం, శ్రేయస్సు, సహనం, న్యాయం, సంతోషం ఇలా…అందరి జీవితంలోనూ వెహికల్ ఆఫ్ లవ్ నడుస్తుంటుంది”అని లాలూ ట్వీట్ లో పేర్కొన్నారు.

మరోవైపు, బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ 15 ఏళ్ల పాలన పూర్తి చేసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా సెలబ్రేషన్లు జరుపుకొంటున్న తరుణంలో లాలూ ‘జీప్’లో హల్‌చల్ చేయడం ఆర్జేడీ అభిమానులను సంబరంలో ముంచెత్తుతోంది.

కాగా, ఆరోగ్య కారణాలు, పశుగ్రాసం కుంభకోణంలో జైలు జీవితం కారణంగా కొన్నేళ్లుగా ఆయన రాజకీయ జీవితానికి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత గత నెలలో బీహార్ ఉప ఎన్నికల ప్రచారంలో లాలూ పాల్గొన్న విషయం తెలిసిందే.