Lalu Prasad Yadav: లాలూ యాదవ్‌కు బెయిల్.. త్వరలో జైలు నుంచి ఇంటికి..

Lalu Yadav Gets Bail In Case Linked To Fodder Scam
Lalu Yadav Bail Granted: బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దుమ్కా కోషాగర్ కేసులో సగం శిక్ష అనుభవించగా.. లాలూ ప్రసాద్ యాదవ్‌కు కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైలు నుంచి బయటకు రావడానికి మార్గం సుగమం అయ్యింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో లాలూకు బెయిల్ మంజూరు అయ్యింది.
అయితే లాలూ కోర్టు అనుమతి లేకుండా దేశం నుండి బయటకు వెళ్ళడానికి వీళ్లేదు.. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి చిరునామా మరియు మొబైల్ నంబర్‌ను మార్చకూడదు. ఈ మేరకు లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు షరతులు విధించింది. లాలూ యాదవ్ బెయిల్‌పై విచారణ జార్ఖండ్ హైకోర్టులో పూర్తయింది.
పశుగ్రాసం కుంభకోణం కేసులో దోషి లాలూ యాదవ్ బెయిల్‌పై విచారణ సందర్భంగా సిబిఐ వాదనలను కోర్టు తిరస్కరించింది. అంతకుముందు, లాలూ బెయిల్‌ను శుక్రవారం విచారించాల్సి ఉంది, కాని జార్ఖండ్ హైకోర్టు ప్రాంగణాన్ని పరిశుభ్రపరచడం వల్ల, లాలూ ప్రసాద్ యాదవ్ బెయిల్‌పై విచారణ వాయిదా పడింది. శుక్రవారం జరగాల్సిన అన్ని కేసులను ఈరోజు ఏప్రిల్ 17 న విచారించి తీర్పులు చెప్పింది కోర్టు.
దాణా కుంభకోణంలో భాగమైన నాలుగు కేసుల్లో.. మూడింటిలో ఆయనకు బెయిల్ గతంలోనే బెయిల్ మంజూరు కాగా.. దుమ్‌కా ట్రెజరీ కేసులో తాజాగా బెయిల్ వచ్చింది. అక్రమ రీతిలో ప్రభుత్వ ఖజానా నుంచి 3.13 కోట్లు అవినీతి చేసినట్లుగా లాలూపై కేసులు ఉన్నాయి. ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్.. ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. త్వరలోనే లాలూ ఇంటికి వెళ్లే అవకాశం ఉంది.