Uttarakhand : ప్రకృతి ప్రకోపం : చూస్తుండగానే సెకన్ల వ్యవధిలో కుప్పకూలింది!

ఉత్తరాఖండ్ లో తరచుగా కొండచరియలు విరిగి పడుతున్నాయి. ఆగస్టు నెలలో ఐదు సార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. శుక్రవారం చంద్రభాగ నదికి ఆనుకోని ఉన్న కొండ విరిగిపడటంతో నది ప్రవాహం నిలిచిపోయింది. నీరు దిగువకు రాకపోవడంతో ఈ నది జలాలపై ఆధారపడిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

Uttarakhand : ప్రకృతి ప్రకోపం : చూస్తుండగానే సెకన్ల వ్యవధిలో కుప్పకూలింది!

Uttarakhand

Uttarakhand : ప్రకృతి మనకు ఎంత వినోదాన్ని పంచుతుందో.. ఒక్కోసారి అంతకు రెండింతల విషాదాన్ని కూడా నింపుతుంది. ప్రకృతిలో భాగమైన జీవనదులు వలన ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. కానీ కొన్ని కొన్ని సార్లు భారీవర్షాలు వచ్చినప్పుడు నది ఉధృతంగా ప్రవహిస్తే.. ఊహించని నష్టం వాటిల్లుతుంది. ప్రకృతి కన్నెర్ర చేస్తే జరిగే పరిణామాలను ఈ మధ్య చూస్తూనే ఉన్నాం.

మొన్నటికి మొన్న ఉత్తరాఖండ్ లో కొండ చరియలు విరిగిపడి 9 మంది మరణించారు. అది జరిగిన కొద్దీ రోజులకే మరోచోట కొండచరియలు విరిగిపడి హైవే పూర్తిగా ధ్వంసమైంది.. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఉత్తరాఖండ్ లోని లాహువల్-స్పితి జిల్లాలో శుక్రవారం కొండచరియలు విరిగి చంద్రభాగ నదిలో పడ్డాయి.

దీంతో ఆ నది ప్రవాహాన్ని మొత్తాన్ని ఇవి అడ్డుకోవడంతో ఆ సరస్సు పరిసరాల్లో ఈ నీటి మీద ఆధారపడిన వ్యవసాయ క్షేత్రాలకు, చుట్టుపక్కల గ్రామాల్లో నివసిస్తున్న దాదాపు 2,000 మంది ప్రజలకు నీటి సమస్య రానుంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం గానీ ఎవరికీ గాయాలు జరగలేదని అధికారులు తెలిపారు.

ఇక ఈ విషయంపై జిల్లా డిప్యూటీ కమిషనర్ నీరజ్ కుమార్ మాట్లాడుతూ.. గురువారం ఉదయం కొండలోని కొంత భాగం కింద పడి పూర్తిగా నదిని అడ్డుకుందని చెప్పారు. కాగా ప్రస్తుతం అక్కడి పరిస్థితిని పరిశీలించడానికి నిపుణుల బృందం వెళ్లిందని తెలిపారు. ఆ వీడియోలో చూస్తుండగానే కొండచరియలు చంద్రభాగ నదిలో పడటంతో పాటు ఆ సరసు మొత్తాన్ని మంచుతో కప్పినట్లు మట్టి కప్పేసిన వీడియోను మనం చూడవచ్చు.