Largest Dog Park : రూ. 3.5 కోట్ల ఖర్చుతో కుక్క‌ల కోసం దేశంలోనే అతిపెద్ద పార్కు..

కుక్కల కోసం ప్రభుత్వాలు పార్కులను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కానీ యూపీలోని నోయిడా అథారిటీ ఏకంగా కుక్కల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేశంలోనే అతి పెద్ద పార్కును నిర్మిస్తోంది. కుక్కలు వాకింగ్ చేయటానికి..అవి ఉయ్యాలు ఊగటానికి ఈ కుక్కల పార్కలులో ప్రత్యేక ఏర్పాట్లను చేస్తోంది. అంతేకాదు కుక్కల కోసం ఏకంగా పార్కులో జిమ్ ను కూడా ఏర్పాటుచేస్తోంది.

Largest Dog Park : రూ. 3.5 కోట్ల ఖర్చుతో కుక్క‌ల కోసం దేశంలోనే అతిపెద్ద పార్కు..

Largest Dog Park

largest dog park will form in noida : కుక్కల కోసం ప్రభుత్వాలు పార్కులను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కానీ యూపీలోని నోయిడా అథారిటీ ఏకంగా కుక్కల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేశంలోనే అతి పెద్ద పార్కును నిర్మిస్తోంది. కుక్కలు వాకింగ్ చేయటానికి..అవి ఉయ్యాలు ఊగటానికి ఈ కుక్కల పార్కలులో ప్రత్యేక ఏర్పాట్లను చేస్తోంది. అంతేకాదు కుక్కల కోసం ఏకంగా పార్కులో జిమ్ ను కూడా ఏర్పాటుచేస్తోంది.

దేశంలోని అతిపెద్ద డాగ్స్ పార్క్ నిర్మాణం గురించి కొంతకాలంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ క్రమంలో దీనిపై యూపీలోని నోయిడా అథారిటీ దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. కుక్క‌ల పార్కు దేశంలోనే అతిపెద్ద పార్కు నిర్మిస్తున్నామని..ఈ పార్కులో కుక్కలు నడిచేందుకు నడక మార్గాలు, అవి ఊగేందుకు ఉయ్యాలలు, జిమ్‌లతోపాటు ఇతర సౌకర్యాలు కూడా క‌ల్పించ‌నున్నామని తెలిపింది.

నోయిడా సెక్టార్ -137లో రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ఈ కుక్కల పార్కును నిర్మించనున్నారు. దీని నిర్మాణానికి సుమారు రూ. 3.5 కోట్ల రూపాయలు ఖర్చు కానుందని వివరించారు. ఈ డాగ్స్ పార్కులో కుక్కల‌ కోసం ఆహారం కూడా అందుబాటులో ఉంటుంది. అంతేకాదు..కుక్కల కోసం ఏకంగా ఈ పార్కులో ప‌శువైద్య నిపుణులు, కుక్క‌ల ట్రైన‌ర్లు కూడా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు.

మరి కుక్క‌ల‌కు ఇన్ని సౌకర్యాలు పొందాలంటే వాటి యజమానులు ఫీజులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. కానీ పార్కులోకి కుక్కల్ని తీసుకురావటానికి ఎంట్రీ ఫ్రీయే. కానీ లోపలికి వచ్చాక తమ కుక్కలకు ప్రత్యేక సౌకర్యాలు కావాలన్నా..చికిత్స కావాలన్నా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కుక్కల పార్కు నిర్వాహణ బాధ్యతను ఓ ప్రైవేటు సంస్థకు ఇవ్వనుంది నోయిడా అథారిటీ.