Accident : పెళ్లి బృందంపైకి దూసుకొచ్చిన లారీ.. వరుడి తండ్రితో సహా ముగ్గురు మృతి

పెళ్లిబృందం మీదకు లారీ దూసుకుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.

10TV Telugu News

Accident :  పెళ్లిబృందం మీదకు లారీ దూసుకుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 226 పక్కగా పెండ్లి బృందం ఉరేగుంపుగా వెళ్తుంది. వేగంగా వచ్చిన లారీ పెళ్లి బృందం మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందాడు. మరికొందరికి గాయాలయ్యాయి. మృతుల్లో వరుడి తండ్రి కూడా ఉన్నాడు.

చదవండి : Russia Coal Mine Accident : బొగ్గు గనిలో భారీ పేలుడు..52 మంది దుర్మరణం..పెరగనున్న మృతుల సంఖ్య

ఇక ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో లారీ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించారు. స్థానికులు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. అక్కడ సీసీ కెమెరాలో రికార్డుగా ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ ఘటన బుధవారం రాత్రి జరిగినట్లు సమాచారం

చదవండి : Fire Accident : సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

 

×