ATGM క్షిపణి ప్రయోగం విజయవంతం

  • Published By: venkaiahnaidu ,Published On : September 23, 2020 / 06:27 PM IST
ATGM క్షిపణి ప్రయోగం విజయవంతం

దేశీయంగా రూపొందించిన లేజర్​ గైడెడ్​ యాంటీ ట్యాంక్​ గైడెడ్​ మిసైల్​(ATGM)ను విజయవంతంగా పరీక్షించింది భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(DRDO). మంగళవారం మహారాష్ట్రలోని అహ్మద్​నగర్ ​లోని ఆర్మర్డ్​ కార్ప్స్​ సెంటర్​, స్కూల్​(ఏసీసీఎస్​)లోని కేకే రేంజ్​ నుంచి ఎంబీటీ అర్జున్​ ట్యాంక్​ ద్వారా ఈ క్షిపణిని ప్రయోగించగా.. 3 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఏటీజీఎం విజయవంతంగా ఛేదించినట్లు డీఆర్​డీఓ తెలిపింది.


పూణేలోని ఆయుధ పరిశోధన మరియు డెవలప్మెంట్ ఎస్టాబ్లిషమెంట్ (ARDE) పూణే…. పూణేలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ (హెచ్‌ఇఎంఆర్‌ఎల్), మరియు ఇన్‌స్ట్రుమెంట్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఐఆర్‌డిఇ) డెహ్రాడూన్ తో కలిసి ఈ క్షిపణిని అభివృద్ధి చేశాయి.

ఏటీజీఎం క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన DRDOకు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. అభినందనలు తెలిపారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. భవిష్యత్తులో రక్షణ ఉత్పత్తుల దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా కృషి చేస్తున్న డీఆర్​డీఓ బృందం పట్ల భారత్​ గర్వపడుతోందన్నారు.


ఈఆర్​ఏ(ఎక్స్​ప్లోసివ్​ రియాక్టివ్​ ఆర్మర్​) రక్షిత సాయుధ వాహనాలను పేల్చేందుకు ఈ క్షిపణి భారీగా ఉష్ణాన్ని ఉత్పన్నం చేస్తుందని డీఆర్​డీఓ తెలిపింది. దీనిని వేరువేరు ప్లాట్​ఫాంల నుంచి ప్రయోగించేందుకు వీలుగా అభివృద్ధి చేసినట్లు వెల్లడించింది.