Bangalore : కూలిన మరో భవనం.. 20 రోజుల్లో ఇది నాలుగో ప్రమాదం

కర్ణాటక రాజధాని బెంగళూరులో వరుసగా భవనాలు కూలిపోతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగళూరులోని కమలా నగర్ లో నాలుగంతస్తుల భవనం ఓ పక్కకు ఒరిగింది.

Bangalore : కూలిన మరో భవనం.. 20 రోజుల్లో ఇది నాలుగో ప్రమాదం

Bangalore

Bangalore :  కర్ణాటక రాజధాని బెంగళూరులో వరుసగా భవనాలు కూలిపోతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగళూరులోని కమలా నగర్ లో నాలుగంతస్తుల భవనం ఓ పక్కకు ఒరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు భవనంలోని వారిని ఖాళీ చేయించారు. అనంతరం సమీపంలోని ఇళ్లలోని వారిని కూడా మరో చోటికి తరలించారు. వారికి వసతి ఆహార ఏర్పాట్లు చేశారు. ఇక బుధవారం ఉదయం.. ఆ భవనాన్ని అధికారులు కూల్చివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

చదవండి : Bangalore : కుప్పకూలిన మరో భవనం.. పదిరోజుల వ్యవధిలో ఇది మూడవది

గత 20 రోజుల్లో ఇది నాలుగవ ఘటన.. గత గురువారం కస్తూరి నగర్‌లో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఇది నిబంధనలను అతిక్రమించి నిర్మించడం వల్లనే కూలిందని అధికారులు తెలిపారు. రెండంతస్తులకు అనుమతి ఉన్న ప్రాంతంలో భవన యజమాని నిబంధనలను బేఖాతరు చేస్తూ మూడు అంతస్తులు నిర్మించాడు. అంతటితో ఆగకుండా పెంట్ హౌస్ కి ప్లాన్ చేశాడు. దీంతో భవనం పునాదిపై బరువు పడి కూలిపోయింది. ఇక వరసగా భవనాలు కూలుతుండటంతో బెంగళూరు మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. నాణ్యతలేని, శిథిలావస్తకు చేరిన భవనాలను కూల్చేస్తున్నారు.

చదవండి : Bangalore : చికెన్‌ ఫ్రై వండలేదని భార్యను హతమార్చిన భర్త