Gas Rate : కొండెక్కిన గ్యాస్ కుండ.. వినియోగదారులకు షాక్‌లే.. షాక్‌లు

దేశంలో గ్యాస్ రేట్లు పరుగులు పెడుతున్నాయి. గడిచిన 8 నెలల్లో గ్యాస్ సిలిండర్ ధర రూ.130 పెరిగింది. సబ్సిడీ కూడా చాలా వరకు తగ్గించింది కేంద్రం.

Gas Rate : కొండెక్కిన గ్యాస్ కుండ.. వినియోగదారులకు షాక్‌లే.. షాక్‌లు

Gas Rate

Gas Rate : నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. వంటనూనె లీటర్ 150పైనే ఉంది. ఇక పప్పుదినుసుల ధర కూడా భారీగానే పెరిగింది. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు కాకపుట్టిస్తున్నాయి. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చితక పనులు చేసుకొని జీవనం సాగించే వారికి పెరిగిన ధరలు గుదిబండలా మారాయి.

చదవండి : Gas Cylinder Price Hiked : రూ.15 పెరిగిన గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌

ఇక ఇవి చాలదన్నట్లు గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ ప్రభావం పేద మధ్యతరగతి ప్రజలతోపాటు హోటల్ నిర్వాహకులపై కూడా పడుతుంది. ఓ వైపు గ్యాస్ ధరలు, మరోవైపు నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చోవడంతో ఆహార పదార్దాల ధరలు పెంచేస్తున్నారు. దీంతో కస్టమర్లు రాక, గిరాకీ లేక హోటల్ నిర్వాహకులు నష్టపోతున్నారు.

చదవండి : Gas Leakage : హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లో గ్యాస్ లీక్

ఇక ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు గ్యాస్ బండపై రూ.131 పెరిగింది. గ్యాస్ బండపై వచ్చే సబ్సిడీ కూడా చాలా వరకు తగ్గింది. ప్రస్తుతం ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ ధర రూ.953గా ఉంది. ఇక దీనిపై 40.72 రూపాయాల సబ్సిడీ వస్తుంది. ఏడాదిన్నర క్రితం ఒక గ్యాస్ బండపై రూ.206 సబ్సిడీ వచ్చేది.. రాను రాను సబ్సిడీని తగ్గించుకుంటూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం.

చదవండి : Indane Gas : కేవలం ఒక్క మిస్డ్ కాల్ తో గ్యాస్ కనెక్షన్ పొందండి

గ్యాస్ ధరల పెరుగుదలతో పేద మధ్యతరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా పెంచుకుంటూ పొతే త్వరలోనే ఒక సిలిండర్ రూ.1000కి చేరే అవకాశం ఉందని అభిప్రాయాన్ని పలువురు వ్య క్తం చేస్తున్నారు. ఇలానే పెరిగితే పేద మధ్యతరగతి ప్రజలు గ్యాస్ కుండలు పక్కకు పెట్టి కట్టెల పొయ్యి ఆశ్రయించాల్సి వస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.