2020లో లాస్ట్ సూర్యగ్రహణం, ఇండియాలో పాక్షికం

  • Published By: madhu ,Published On : December 14, 2020 / 10:05 AM IST
2020లో లాస్ట్ సూర్యగ్రహణం, ఇండియాలో పాక్షికం

Last solar eclipse of 2020 : ఈ ఏడాదిలో ఆఖరి సూర్యగ్రహణం 2020, డిసెంబర్ 14వ తేదీ సోమవారం చోటు చేసుకోనుంది. ఉదయం 7 గంటల 03 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాల వరకు సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం ప్రభావం ఎక్కువగా దక్షిణ అమెరికాలోని చీలి, అర్జెంటీనా దేశాల్లో ఉంటుంది. ఆ దేశాల్లో దాదాపు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో అక్కడ పట్టపగలు చీకట్లు అలుముకోనున్నాయి.

ఇండియాతో సహా అనేక దేశాల్లో పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది. ఈ గ్రహణం వల్ల ఇండియాలో చీకట్లు కమ్ముకోవు కానీ, సూర్యుడిపై చంద్రుని నీడను మాత్రం స్పష్టంగా మనం చూడవచ్చు. అంతేకాదు ఫిల్మ్ వంటి వాటిని ఉపయోగించి ఈ గ్రహణాన్ని మనం చూడటం వల్ల కళ్లకు హానీ జరగదు. ఈ ఏడాదికి ఇదే ఆఖరి సూర్యగ్రహణం కావడంతో గ్రహణాన్ని చూడాలని ఔత్సాహికులు అనుకుంటున్నారు. సూర్యగ్రహణం మొత్తం 5 గంటలపాటు కొనసాగుతుంది. గ్రహాణం సందర్భంగా ఆలయాలు మూతపడనున్నాయి. కార్తీకమాసం చివరి సోమవారంనాడు, అది అమవాస్య రోజున సూర్యగ్రహణం రావడం మరో విశేషం.