లతా మంగేష్కర్ బిల్డింగ్ సీజ్!

  • Published By: madhu ,Published On : August 30, 2020 / 12:59 PM IST
లతా మంగేష్కర్ బిల్డింగ్ సీజ్!

మ్యూజిక్ లెజెండ్, భారతరత్న లతా మంగేష్కర్ నివాసం ఉంటున్న భవనాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీల్ చేశారు. ఎందుకు సీజ్ చేశారు ? అంటూ ఏదో ఆలోచించకండి. బయటి వ్యక్తులు రాకపోకలు సాగించకుండా..ఉండడానికి ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఎందుకంటే..ముంబై మహానగరంలో కరోనా వైరస్ వ్యాపిస్తుండడమే కారణం. ప్రస్తుత పరిస్థితుల్లో ముందు జాగ్రత్త చర్యగా బీఎంసీ అధికారులు ఈ భవనాన్ని సీల్ చేశారు. లతా మంగేష్కర్ నివాస భవన సముదాయం ప్రభుకుంజ్..ముంబై దక్షిణ ప్రాంతంలోని పెద్దర్ రోడ్ గల ఛాంబల్లా హిల్ లో ఉంటుందనే విషయం తెలిసిందే.

లతా..తన కుటుంబసభ్యులతో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఈమె వయస్సు 90 సంవత్సరాలు. కుటుంబ సభ్యులందరూ ఏజ్ ఎక్కువ కావడంతో…అందుకే ఈ భవనాన్ని సీజ్ చేయడం జరిగిందని అధికారులు వెల్లడిస్తున్నారు.

ముంబైలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. వయస్సు మళ్లిన వారికి వైరస్ త్వరగా సోకుతుందనే విషయం తెలిసిందే. ప్రస్తుతం లతా..ఆమె కుటుంబసభ్యులు సురక్షితంగా ఉన్నారని, ముందు జాగ్రత్తలో భాగంగానే భవనాన్ని సీజ్ చేశామన్నారు.

కరోనా వైరస్ సెలబ్రెటీలను కూడా వదలడం లేదు. ఇటీవలే..బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుటుంబం..వైరస్ బారిన పడ్డారు. భార్య జయా బచ్చన్ మినహా…మిగిలిన వారందరూ కరోనా వైరస్ సోకింది. దీంతో…బిగ్ బి నివాసాన్ని సీజ్ చేశారు. వైరస్ నుంచి బిగ్ బి, కుమారుడు అభిషేక్ బచ్చన్ కోడలు ఐశ్వర్య రాయ్, మనవరాలు ఆరాధ్య కోలుకున్నారు.