Lata Mangeshkar: వృద్ధాశ్రమం ఏర్పాటు చేయనున్న లతా మంగేశ్కర్ కుటుంబ సభ్యులు

నాసిక్‌లో సీనియర్ కళాకారుల కోసం లతా మంగేష్కర్ కుటుంబం వృద్ధాశ్రమాన్ని నిర్మించాలని ప్లాన్ చేసింది. దివంగత గాయనీమణి లతా జూలై 2021లో తన NGO ద్వారా ఫౌండేషన్‌ను రిజిష్టర్ చేశారు. లతా మంగేష్కర్ కుటుంబం గురు పూర్ణిమ సందర్భంగా మహారాష్ట్రలోని నాసిక్‌లో లాభాపేక్షలేకుండా 'ది స్వర్ మౌలి ఫౌండేషన్'ని ప్రారంభించింది.

Lata Mangeshkar: వృద్ధాశ్రమం ఏర్పాటు చేయనున్న లతా మంగేశ్కర్ కుటుంబ సభ్యులు

Lata Mangeshkar

 

 

Lata Mangeshkar: నాసిక్‌లో సీనియర్ కళాకారుల కోసం లతా మంగేష్కర్ కుటుంబం వృద్ధాశ్రమాన్ని నిర్మించాలని ప్లాన్ చేసింది. దివంగత గాయనీమణి లతా జూలై 2021లో తన NGO ద్వారా ఫౌండేషన్‌ను రిజిష్టర్ చేశారు. లతా మంగేష్కర్ కుటుంబం గురు పూర్ణిమ సందర్భంగా మహారాష్ట్రలోని నాసిక్‌లో లాభాలను ఆశించకుండా ‘ది స్వర్ మౌలి ఫౌండేషన్’ని ప్రారంభించింది.

ఫిబ్రవరి 6న కన్నుమూసిన భారతరత్న గ్రహీత లతా..  పిల్లలు వదిలేసిన లేదా ఏదైనా ఆర్థిక సహాయం అవసరమైన పేరెంట్స్ కోసం వృద్ధాప్య కళాకారులకు ఒక ఆసరా కల్పించాలనుకునేవారు. ఈ మేరకు లతా మంగేష్కర్ కుటుంబం ఆ కలను నెరవేర్చాలని పూనుకుంది.

“వృద్ధాశ్రమాన్ని నిర్మించి సహాయం అవసరమైన కళాకారులకు సాయం చేయాలని స్వర్ మౌళి ఫౌండేషన్ నిశ్చయించుకుంది. పిల్లలు వదిలేసిన వారి జీవితాలు నిలబెట్టుకోవడానికి, ఆర్థికంగా నిస్సహాయంగా భావించే వృద్ధ కళాకారులకు సహాయం అందించడం, వైద్యం అందించడం వంటివి” ఈ ఫౌండేషన్ పూర్తి చేస్తుంది.

Read Also: అయోధ్యలో ఒక కూడలికి “లతా మంగేష్కర్” పేరు: యోగికి మోదీ ప్రశంస

“నా చిన్ననాటి రోజుల్లో, మన సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది కళాకారులు వారి జీవితం చివరి దశలో ఆపదలో మిగిలిపోవడాన్ని చూశా. నా మనసులో చెరగని ముద్ర వేసింది. సంవత్సరాలు గడిచేకొద్దీ, జీవితంలోని ఈ బాధను నయం చేయడానికి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను” అని లతా మంగేష్కర్ అన్నారు.
`