ఎమర్జెన్సీ ట్రాకర్: ప్రమాదాల నుంచి కాపాడే “Optisafe”

  • Published By: veegamteam ,Published On : December 3, 2019 / 05:05 AM IST
ఎమర్జెన్సీ ట్రాకర్: ప్రమాదాల నుంచి కాపాడే “Optisafe”

ప్రమాదంలో ఉన్నవారి కోసం సరికొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది. దాని పేరు ‘ఆప్టి సేఫ్’. ప్రమాదం అనేది ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా రావచ్చు. అందుకే ‘ఆప్టి సేఫ్’ ను అందుబాటులో ఉంచుకుంటే ప్రమాదం నుంచి ఇట్టే బైటపడొచ్చు. ఈ పరికరాన్ని టెలికాం ఎంటర్ప్రైజ్ ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్  వెంచర్ ఆప్టిసాఫ్, మై హీరో అనే డిస్ట్రెస్ కంపానియన్ పరికరాన్ని భారతదేశంలో రూ .2,999 కు విడుదల చేసింది. 

ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా సహాయం పొందటానికి  ఈ పరికరం ఉపయోగపడుతుంది. ఇది ఇండియాలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్ లో మార్చి 8 ( అంతర్జాతీయ మహిళా దినోత్సవం) నుండి అందుబాటులోకి రానుంది. 

ఇది ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..
ఒక అమ్మాయి రోడ్డు మీదవెళ్తుండగా..బండి మీద వచ్చిన ఆకతాయులు ఆమెను బెదిరించినా..అసభ్యంగా ప్రవర్తించినా..లేదా ఇంకే అఘాయిత్యానికైనా యత్నించినా వెంటనే హ్యాండ్ బాగ్ కి ఉన్న ఆప్టి సేఫ్ అనే పరికరం పైన ఉండే క్యాప్ ని తీస్తే వెంటనే సైరన్ మోగుతుంది. దీంతో పాటు స్మార్ట్ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ కి మెసేజ్ వెళ్తుంది. అంతేకాదు..సదరు వ్యక్తి ఉన్న లొకేషన్ తో పాటు నేను ప్రమాదంలో ఉన్నాను అనే మెసేజ్ కూడా సెండ్ అవుతుంది. ఆ చుట్టు పక్కల ఉండే వ్యక్తులకు కూడా కూడా ఈ సైరన్ సౌండ్ వినిపిస్తుంది. 

సైరన్ మోగుతుందనే విషయం తెలియని సదరు ఆకతాయిలు గానీ..దుర్మార్గులు గానీ షాక్ అవుతారు. వెంటనే పలాయనం చిత్తగించే అవకాశం ఉంది.అంతేకాదు ‘ఆప్టి సేఫ్’ కు ఉన్న స్పై కెమెరా అక్కడ జరిగే  దృశ్యాల ఆడియో..వీడియోలను రికార్డ్ చేస్తుంది. ఆ పరిసరాల్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్న లేక యాక్సిడెంట్ అయినవారు ఉన్నా..ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ‘ఆప్టి సేఫ్’ పరికరం ఆన్ లైన్ లో రూ. 3 వేల వరకు ఉంది. ఇది కేవలం మహిళలకే కాదు ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఈ కింది లింక్‌లో దాన్ని పొందవచ్చు.

 ‘ఆప్టి సేఫ్’ను ప్రారంభించిన సందర్భంగా  ‘ఆప్టి సేఫ్’ సీఈవో దినేష్ ప్రసాద్ మాట్లాడుతూ..మహిళల భద్రత విషయంలో ఆందోళన కలుగుతున్న ఈ పరిస్థితుల్లో  ‘ఆప్టి సేఫ్’ అందుబాటులో ఉంచుకోవట ద్వారా ప్రమాదాల నుంచి అఘాయిత్యాల నుంచి బైటపడవచ్చునని తెలిపారు.