నవ్వు ఆపుకోలేరు, మెచ్చుకోకుండా ఉండలేరు : సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసిన మీమ్స్

  • Published By: veegamteam ,Published On : October 30, 2019 / 07:31 AM IST
నవ్వు ఆపుకోలేరు, మెచ్చుకోకుండా ఉండలేరు : సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసిన మీమ్స్

మీమ్స్.. సోషల్ మీడియాలో ఓ ట్రెండ్. చూడగానే నవ్వు వస్తుంది. కడుపు చెక్కలవుతుంది. ఓ చిన్న బొమ్మ దాని కింద రాసే అక్షరాలు.. ఎంతో అర్థాన్ని ఇస్తాయి. అంతేకాదు కామెడీ పూయిస్తాయి. చూసినోళ్లు నవ్వకుండా ఉండలేరు. అంతేనా.. ఏం క్రియేషన్ రా బాబూ అని మెచ్చుకోకుండా ఉండలేరు. ఇప్పటివరకు ఎన్నో మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, అవుతూనే ఉన్నాయి. సందర్భానికి, సమయానికి అనుగుణంగా వీటిని నెటిజన్లు వాడుకుంటున్నారు.

The latest meme trend is about what people did before things were invented

మీమ్స్ విషయానికి వస్తే.. ఇప్పటికీ కొన్ని సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఉదాహరణకు ట్యూబ్ లైట్ మీమ్. 1850లో ట్యూబ్ లైట్ కనిపెట్టారు. అంతకముందు వరకు ట్యూబ్ లైట్ అంటే ఏంటో తెలియదు. దీన్ని వివరిస్తూ ఫన్నీగా క్రియేట్ చేశారు. ఓ మహిళ పిక్ ఉంది. అందులో ఆమె దంతాలు తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంటాయి. 1850కి ముందు.. ట్యూబ్ లైట్ లేని రోజుల్లో… వెలుతురు కోసం జనాలు ఇదిగో ఇలా.. దంతాలు చూపించే వారిని, ఆ వెలుగులో పని చేసుకునే వారని మీమ్ క్రియేట్ చేశారు. ఈ మీమ్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉండటం విశేషం.

The latest meme trend is about what people did before things were invented

ట్రెండింగ్ లో ఉన్న మరో మీమ్.. ఒడ్డున కూర్చుని కర్రతో సాయంతో చేపలు పట్టే యాడ్. ఓ యాడ్ లో ఓ వ్యక్తి కర్రకు ఫెవికాల్ పూసి నీళ్లలో చేపలు పడతాడు. దీన్ని నెటిజన్లు బాగా వాడుకున్నారు. తమ క్రియేటివిటీని చూపించారు. చేపలు పట్టే వలని 8300 బీసీలో కనుగొన్నారు. అంతకుముందు చేపలు పట్టేందుకు ఇదిగో ఈ విధానాన్నే ఫాలో అయ్యేవారు అని మీమ్ తయారు చేశారు. ఈ మీమ్ ఓ రేంజ్ లో నెటిజన్లను అట్రాక్ట్ చేసింది.

The latest meme trend is about what people did before things were invented

ఇక మరో మీమ్ డోర్ బెల్ గురించి… డోర్ బెల్ ని 1831లో కనిపెట్టారు. మరి అంతకుముందు వరకు డోర్ బెల్ స్థానంలో ఏం వాడారు అనేది తెలుపుతూ చాలా ఫన్నీగా మీమ్ క్రియేట్ చేశారు. ఇందుకోసం షారుక్ ఖాన్ సినిమాలోని ఓ పిక్ ను వాడుకున్నారు. అందులో హారతి ఇచ్చే సీన్ ఉంది. డోర్ బెల్ లేని రోజుల్లో ఇదిగో ఇలా పిలిచేవారని తెలుపుతూ మీమ్ రూపొందించారు.

meme

ఇంకో మీమ్.. కుర్చీ గురించి. తొలి కుర్చీ 1760లో తయారు చేశారు. మరి అంతకుముందు వరకు జనాలు ఎలా కూర్చునేవారు అని తెలుపుతూ మీమ్ క్రియేట్ చేశారు. ఇందుకోసం క్రికెటర్ పిక్ ని వాడుకున్నారు. స్టేడియంలో ఓ సైడ్ లో నేలపై స్పిన్నర్ చాహల్ కూర్చుని ఉన్నాడు. చైర్లు లేని రోజుల్లో జనాలు.. ఇదిగో ఇలా..నేలపై కూర్చునే వారు అని కామెంట్ చేశారు.

5

లగాన్ మూవీలోని అమీర్ ఖాన్ టీమ్ పిక్ కూడా ప్రముఖ మీమ్ అయ్యింది. ఈ పిక్ లో అంత అర్థముందా అనిపించేలా మీమ్ క్రియేట్ చేశారు. ఫస్ట్ క్రికెట్ ఇండియన్ టీమ్ 1721లో ఫార్మ్ అయ్యింది. అంతకుముందు.. ఇండియన్ టీమ్ ఇదిగో ఇలా ఉండేది అని చెబుతూ.. లగాన్ మూవీ పిక్ ని మీమ్ గా తయారు చేసి నవ్వులు పూయించారు.

6

బుల్లెట్ ప్రూఫ్ గురించి వచ్చిన మీమ్ మామూలుగా లేదు. కడుపు చెక్కలవ్వాల్సిందే. ఓ సినిమాలోని పిక్ ని ఓ రేంజ్ లో వాడుకున్నారు. 1893లో బుల్లెట్ ప్రూఫ్ కనిపెట్టారు. అంతకుముందు.. సైకిలే బుల్లెట్ ప్రూఫ్ అని అర్థం వచ్చేలా మీమ్ చేశారు. ఓ సైకిల్ బార్ కింద నుంచి గన్ పట్టుకుని హీరో కాల్పులు జరిపే పిక్ ని ఇలా వాడుకున్నారు. దానికి క్రియేటివిటీ జోడించి నవ్వులు పూయించారు. బుల్లెట్ ప్రూఫ్ లేని రోజుల్లో జనాలు.. ఇదిగో ఇలా.. సైకిల్ నే బుల్లెట్ ప్రూఫ్ గా వాడుకున్నారని ఫన్నీగా వర్ణించారు.

7

1956 ముందు వరకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ సిస్టమ్ లేదు. మరి ఆ రోజుల్లో డాక్టర్లు అల్ట్రాసౌండ్ ఎలా చేసే వారు అనేది వర్ణిస్తూ ఫన్నీగా మీమ్ చేశారు. దీనికి ఓ సినిమాలోని పిక్ ని వాడుకున్నారు. ఇద్దరు హీరోయిన్ల కడుపు భాగంలో హీరోలు తమ చెవులు ఆనించిన సీన్ అది. అల్ట్రాసౌండ్ సిస్టమ్ లేని రోజుల్లో డాక్టర్లు.. ఇదిగో ఇలానే చేసేవారు అంటూ మీమ్ రూపొందించారు.

8

1990లో ఎమోజీలు వచ్చాయి. మాటల్లో పలికించలేని, చెప్పలేని భావాలను ఈ ఎమోజీలతో చెప్పొచ్చు. హావభావాలు తెలిపేందుకు వీలుగా ఎమోజీలను అందుబాటులోకి తెచ్చారు. మరి ఎమోజీలు లేని రోజుల్లో హావభావాలను ఎలా తెలిపేవారో చెబుతూ.. ఓ మీమ్ తయారుచేశారు. అందులో క్రికెటర్ విరాట్ కోహ్లి చూపిన పలు రకాల హావభావాలను ఉంచారు. ఈ మీమ్ కూడా ఓ రేంజ్ లో వైరల్ అయ్యింది.

9

ఇక హనుమంతుడు గాల్లోకి ఎగురుతున్నట్టు ఉన్న మీమ్ మాములూగా ట్రెండ్ అవ్వలేదు. దీనికి సరికొత్త అర్థం ఇచ్చారు నెటిజన్లు. సూపర్ మ్యాన్ 1938లో వచ్చాడు.. మరి అంతకుముందు సూపర్ హీరో ఇదిగో ఇలా ఉండేవాడు అంటూ.. హనుమంతుడి పిక్ ని వాడుకున్నారు.

ఇలా చెప్పుకుంటూ పోతే… ఎన్నో మీమ్ లు సోషల్ మీడియాని షేక్ చేశాయి. పిక్ లను సమయానికి, సందర్భానికి అనుగుణంగా వాడుకుని నవ్వులు పూయిస్తున్నారు. చూడటానికి సింపుల్ గా ఉన్నా అందులో చాలా మీనింగ్ ఉంటుంది. అంతేకాదు ఫన్ కూడా ఉంటుంది. మీమ్ ని చూసినోళ్లు.. నిజమే కదా అని అనకుండా ఉండలేరు.. మెచ్చుకోకుండా ఆగలేరు, నవ్వు ఆపుకోలేరు.