Sedition Law: దేశద్రోహ చట్టాన్ని కొనసాగించాల్సిందే.. లా కమిషన్ షాకింగ్ కామెంట్స్

ఐపీసీ సెక్షన్ 124ఏ అమలును నిలిపివేస్తూ 2022 మే 11న అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఐపీసీ సెక్షన్ 124ఏను కొనసాగించాలా? వద్దా? అనే అంశాన్ని పునఃపరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం అంతకుముందు సుప్రీంకోర్టుకు చెప్పింది

Sedition Law: దేశద్రోహ చట్టాన్ని కొనసాగించాల్సిందే.. లా కమిషన్ షాకింగ్ కామెంట్స్

Law Commission: దేశద్రోహ చట్టాన్ని (ఐపీసీ సెక్షన్ 124ఏ) తొలగించాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. బ్రిటిషర్ల హయాంలో తీసుకువచ్చిన ఈ చట్టాన్ని ఇప్పటి వరకు కొనసాగించాల్సిన అవసరం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మధ్య దీనిపై చర్చ పెరిగింది. కొంత కాలం క్రితం.. దీనిపై రివ్యూ చేసి ఓ నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో లా కమిసన్ (శాసన పరిశీలన సంఘం) భిన్న రీతిలో స్పందించింది. దేశద్రోహాన్ని నేరంగా పరిగణించడం కొనసాగించాలని అన్న లా కమిషన్ శిక్షా కాలాన్ని మూడేళ్ల నుంచి ఏడేళ్లకు పెంచాలంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

China : భూమి పుట్టుక, మార్పులను తెలుసుకునేందుకు.. చైనాలో భూమి లోపలికి 10 కిలోమీటర్ల లోతుగా బోర్ వెల్

అయితే భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 124ఏకు కొన్ని సవరణలు అవసరమని ప్రభుత్వానికి 22వ శాసన పరిశీలన సంఘం (ప్రస్తుత లా కమిషన్) సిఫారసు చేసింది. విశ్రాంత కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితు రాజ్ అవస్థి నేతృత్వంలోని లా కమిషన్ ఈ సిఫారసు చేసింది. ఈ చట్టం కింద నేరస్థులకు మూడేళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధించాలని ప్రస్తుత నిబంధనలు చెప్తున్నాయని, అయితే వాటిని ఏడేళ్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు లా కమిషన్ చేసింది. ఐపీసీ సెక్షన్ 124ఏ అమలును నిలిపివేస్తూ 2022 మే 11న అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఐపీసీ సెక్షన్ 124ఏను కొనసాగించాలా? వద్దా? అనే అంశాన్ని పునఃపరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం అంతకుముందు సుప్రీంకోర్టుకు చెప్పింది. అంతకు ముందు దేశద్రోహ చట్టాన్ని సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది.

Mayawati: కాంగ్రెస్ ‘ఉచిత కరెంటు, సబ్సిడీ గ్యాస్’ పథకాలపై విరుచుకుపడ్డ బీఎస్పీ చీఫ్ మాయావతి

ఈ చట్టం దుర్వినియోగమవుతోందనే వాదనలపై స్పందిస్తూ అలాంటివి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కమిషన్ సూచించింది. నేర శిక్షా స్మృతి (సీఆర్‭పీసీ) సెక్షన్ 196(3)కి సారూప్యమైన నిబంధనను సీఆర్‌పీసీ సెక్షన్ 154లో చేర్చాలని సిఫారసు చేశారు. ఐపీసీ సెక్షన్ 124ఏ క్రింద నేరానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ దాఖలుకు ముందు అవసరమైన విధానపరమైన రక్షణ కోసం ఇటువంటి నిబంధనను చేర్చాలని తెలిపారు. ఐపీసీ సెక్షన్ 124ఏ చాలా విస్తృతమైనదని, దీని పరిధిలోకి వచ్చే నేరాలు ఇతర చట్టాల పరిధిలోకి రావని తెలిపింది.

Caste System: గతంలో కులవివక్ష లేదనడం అబద్ధం, జరిగిన అన్యాయాన్ని అంగీకరించాలి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్

ఈ చట్టం ఎందుకు కొనసాగించాలో లా కమిషన్ కొన్ని కారణాల్ని సూచించింది. దేశ ఐక్యత, సార్వభౌమాధికారాలను పరిరక్షించడంతో పాటు రాడికలైజేషన్‌ను ఎదుర్కొనడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. దేశద్రోహాన్ని నేరంగా పరిగణించే నిబంధనలు బ్రిటిష్ పాలనా కాలంలో వచ్చాయని, భారత దేశ స్వాతంత్ర్య సమర యోధులపై ఈ చట్టాన్ని ప్రయోగించారని చెప్తూ రద్దు చేయాలని కోరడం సరికాదని, దీనిని రద్దు చేయడానికి అవి సరైన కారణాలు కాదని నొక్కి చెప్పింది. ఆ మాటకు వస్తే భారతీయ న్యాయ వ్యవస్థలో మొత్తం వలస పాలన వారసత్వమే ఉందని పేర్కొంది.