Gurugram: మూత్ర విసర్జనకని బెంజ్ కారును రోడ్డు పక్కన ఆపిన లాయర్.. కత్తితో బెదిరించి కారెత్తుకెళ్లిన దుండగులు

మెర్సిడెజ్-సీ220 మోడల్ వైట్ కారులో నేను లిక్కర్ షాపుకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నాను. మధ్యలో ఆడి షోరూంకి సమీపంలో మూత్ర విసర్జన చేయడానికని రోడ్డు పక్కన కారు ఆపాను. తిరిగి వస్తుంటే ఒక హుందాయ్ కారు నా కారు ముందు ఆగింది. అందులోంచి ముగ్గురు వ్యక్తులు దిగి నావైపు వచ్చారు.

Gurugram: మూత్ర విసర్జనకని బెంజ్ కారును రోడ్డు పక్కన ఆపిన లాయర్.. కత్తితో బెదిరించి కారెత్తుకెళ్లిన దుండగులు

Lawyer Stops Mercedes To Urinate, Men With Knife Steal His Car

Gurugram: బహిరంగ మలమూత్ర విసర్జన చేయవద్దని ప్రభుత్వం పదే పదే చెప్తున్నప్పటికీ కొందరి బుద్ధి మారడం లేదు. దీని వల్ల పర్యావరణ పరమైన నష్టాలే కాకుండా మరికొన్ని వ్యక్తిగత నష్టాలు కూడా ఉంటాయని తాజాగా జరిగిన ఒక ఘటన తెలియజేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని గురుగ్రాంకు చెందిన ఒక లాయర్ కారు, బహిరంగ మలమూత్ర విసర్జన కారణంగా పోగొట్టుకోవాల్సి వచ్చింది. మూత్ర విసర్జనకని రోడ్డు పక్కన కారు ఆపిన ఆయనను, ముగ్గురు వ్యక్తులు వచ్చి కత్తితో బెదిరించి కారు ఎత్తుకెళ్లారు.

India-China Clash: దేశంలో 3,560 చైనా డైరెక్టర్లు.. చైనాపై రాహుల్ కామెంట్ల అనంతరం కాంగ్రెస్

బాధితుడు అనుజ్ బేడి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం బయటపడింది. గురుగ్రాంలోని సెక్టార్-29 ప్రాంతంలో గురువారం జరిగిందీ ఘటన. సెక్టార్-66లో నివసించే అనుజ్ బేడి కారును సెక్టార్-29లోని ఫైర్ స్టేషన్, ఆడి షోరూం మధ్యలో రాత్రి 8:50 గంటలకు చోరీకి గురైందట. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ‘‘మెర్సిడెజ్-సీ220 మోడల్ వైట్ కారులో నేను లిక్కర్ షాపుకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నాను. మధ్యలో ఆడి షోరూంకి సమీపంలో మూత్ర విసర్జన చేయడానికని రోడ్డు పక్కన కారు ఆపాను. తిరిగి వస్తుంటే ఒక హుందాయ్ కారు నా కారు ముందు ఆగింది. అందులోంచి ముగ్గురు వ్యక్తులు దిగి నావైపు వచ్చారు. ఒక వ్యక్తి నా మెడపై కత్తి పెట్టి బెదిరించి కారు తాళాలు తీసుకున్నాడు. అనంతరం నా కారుతో అక్కడి నుంచి ఉడాయించారు’’ అని పేర్కొన్నారు.

Nitin Gadkari: 2024 నాటికి అమెరికాతో సమానంగా భారత్.. కేంద్ర మంత్రి గడ్కరి

కారు ఎత్తుకెళ్లిన వారిపై భారత శిక్ష స్మృతిలోని సెక్షన్ 382 (నేరపూరితంగా దొంగతనం చేయడం), సెక్షన్ 34 (అలవాటు పూరితంగా నేరాలకు పాల్పడడం) కింద సెక్టార్-29 పోలీస్ స్టేషనులో కేసు నమోదు అయింది. కాగా లాయర్ బేడి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నామని, తొందరలోనే నిందితులను పట్టుకుంటామని సెక్టార్-29 ఏఎస్ఐ సందీప్ కుమార్ తెలిపారు.