west bengal: బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన కోరుతున్న లాయర్లు.. ఎందుకంటే!

గత ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత, రాష్ట్రంలో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ హింసలో బాధితుల తరఫున వాదిస్తున్న లాయర్లు, బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నారు.

west bengal: బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన కోరుతున్న లాయర్లు.. ఎందుకంటే!

Post Poll Bengal Violence

west bengal: గత ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత, రాష్ట్రంలో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ హింసలో బాధితుల తరఫున వాదిస్తున్న లాయర్లు, బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నారు. హింసలో నష్టపోయిన బాధితుల సమస్యల్ని ప్రపంచం దృష్టికి తెచ్చేందుకు ఈ నెల 29, శుక్రవారం ఢిల్లీలో శాంతియుత క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించినట్లు లాయర్లు తెలిపారు. బెంగాల్ ఎన్నికల హింస బాధితుల తరఫున పోరాడుతున్న లాయర్లు ‘లాయర్స్ ఫర్ జస్టిస్’ పేరుతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందని వ్యాఖ్యానించారు.

Mamata Banerjee: బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు మమతా బెనర్జీ లెటర్

‘‘బెంగాల్‌లో న్యాయం కొసం జరుగుతున్న పోరాటాన్ని ఇప్పుడు ఢిల్లీలోనూ కొనసాగించబోతున్నాం. ఈ పోరాటాన్ని దేశవ్యాప్తం చేస్తాం. దేశం ఇప్పుడు.. న్యాయం కోసం.. బెంగాల్ కోసం పోరాడుతుంది’’ అని లాయర్లు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అదుపుతప్పిన లా అండ్ ఆర్డర్‌ను గాడిలో పెట్టాలంటే రాష్ట్రపతి పాలన ఒక్కటే మార్గమని అన్నారు. రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ రాష్ట్రపతిని, కేంద్ర మంత్రుల్ని కలుస్తామని వెల్లడించారు.