Leaked Data : పిజ్జా బ్రాండ్ డొమినోస్ డేటా లీక్! Dominos India Users : పిజ్జా బ్రాండ్ డొమినోస్ డేటా లీక్ | Leaked data of Dominos

Leaked Data : పిజ్జా బ్రాండ్ డొమినోస్ డేటా లీక్!

ఎయిర్ ఇండియా డేటా లీక్ అందర్నీ కలవరపాటుకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఇది మరిచిపోకముందే..మరో సంస్థకు చెందిన డేటా లీక్ అయ్యింది.

Leaked Data  : పిజ్జా బ్రాండ్ డొమినోస్ డేటా లీక్!

Dominos : హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. ప్రముఖ సంస్థలను టార్గెట్ చేస్తూ..వారికి సంబంధించిన డేటాను చోరీ చేసేస్తున్నారు. కస్టమర్ల డేటా, వారికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని కూడా తస్కరిస్తున్నారు. ఇటీవలే..ఎయిర్ ఇండియా డేటా లీక్ అందర్నీ కలవరపాటుకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఇది మరిచిపోకముందే..మరో సంస్థకు చెందిన డేటా లీక్ అయ్యింది.

పిజ్జా బ్రాండ్ లో డొమి నోస్ ప్రముఖ స్థానం సంపాదించింది. దీనికి ఎన్నో బ్రాంచీలున్నాయి. అయితే..దీనికి సంబంధించిన డేటా లీక్ అయ్యింది. దాదాపు 18 కోట్ల ఆర్డర్ డేటా లీక్ అయినట్లు తెలుస్తోంది. సంస్థలో ఉన్న కస్టమర్ల డేటా లీక్ అయ్యిందనే వార్త కలవరపాటుకు గురి చేసింది. కానీ..వినియోగదారుల ఆర్థిక సమాచారానికి సంబంధించి ఎలాంటి ముప్పు వాటిల్లలేదని డొమినోస్ సంస్థ స్పష్టం చేసింది.

ఈ సంస్థలో ఉన్న 18 కోట్ల చందాదారుల ఆర్డర్‌ల డేటా లీక్ అయినట్లు సైబర్ సెక్యూర్టీ పరిశోధకుడు రాజశేఖర్ రాజరియా వెల్లడించారు. డార్క్ వెబ్ లో హ్యాకర్ సెర్చ్ ఇంజిన్ సృష్టించినట్లు, చందాదారుడిపై నిఘా పెట్టేందుకు దీనిని ఉపయోగించనట్లు తెలిపారు. డేటా లీక్ అయినా..తమ వ్యాపారంపై ఎలాంటి ప్రభావం చూపెట్టలేదని, ఎలాంటి ఆర్థిక సమాచారం, క్రెడిట్ కార్డుల డేటా నిల్వ చేయదని డొమినోస్ వెల్లడించింది.

Read More :  Changes Must : కరోనా నుంచి కోలుకున్నవారు వీటిని కచ్చితంగా మార్చేయాలి..లేదంటే ప్రమాదమే

×