Tamil Nadu Governor: ఫుల్ కాంట్రవర్సీలోనూ తగ్గని తమిళనాడు గవర్నర్.. తాజాగా హిందీ వ్యాఖ్యలు

ఇంత కాంట్రవర్సీ అనంతరం సైతం గవర్నర్ మరోసారి వివాదాస్పదంగా వ్యాఖ్యానించినట్లే కనిపిస్తోంది. తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అందరూ హిందీ నేర్చుకోవాలని సూచించారు. ఒక భాష నేర్చుకోవాలనే సూచన వివాదాస్పదమేమీ కాదు కానీ.. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమ ప్రభావం ఇప్పటికీ అలాగే ఉంది

Tamil Nadu Governor: తమిళనాడులో గవర్నర్ ఆర్ ఎన్ రవికి అధికార పార్టీకి మధ్య రాజుకున్న వివాదం తారాస్థాయికి చేరింది. తమిళనాడు పేరును మరో విధంగా గవర్నర్ వ్యాఖ్యానిస్తుండడం, అలాగే అన్నాదురై, పెరియార్ వంటి పేర్లను ప్రస్తావించకపోవడం పట్ల తాజాగా అసెంబ్లీలోనే అగ్గి రాజేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మాత్రమే స్పీకర్ రికార్డ్ చేయాలని, గవర్నర్ జోడించిన, దాటవేయబడిన భాగాలను తొలగించాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గవర్నర్ ఎదుటే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో చేసేదేమీ లేక గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

Union Law Ministry: 79 శాతం జడ్జీలు అగ్రకులం వారే.. కేంద్ర ప్రభుత్వం వెల్లడి

ఇంత కాంట్రవర్సీ అనంతరం సైతం గవర్నర్ మరోసారి వివాదాస్పదంగా వ్యాఖ్యానించినట్లే కనిపిస్తోంది. తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అందరూ హిందీ నేర్చుకోవాలని సూచించారు. ఒక భాష నేర్చుకోవాలనే సూచన వివాదాస్పదమేమీ కాదు కానీ.. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమ ప్రభావం ఇప్పటికీ అలాగే ఉంది. పైగా గవర్నర్‭పై అధికార పార్టీ సహా తమిళులు భగ్గుమంటున్న ఈ తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు మరింత దుమారానికి దారి తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Bharat Jodo Yatra: ఎముకలు కొరికే చలిలోనూ టీ-షర్టు మీదే.. స్వెటర్ వేసుకోకపోవడానికి కారణం వెల్లడించిన రాహుల్

మంగళవారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ ఆర్ ఎన్ రవి మాట్లాడుతూ ‘‘మనం చాలా భాషలు నేర్చుకోవాలి. మన దేశంలో చాలా భాషలు ఉన్నాయి. అందులో వీలైనన్ని భాషలు మాట్లాడటం నేర్చుకోవాలి. అలాగే దేశంలో ఎక్కువ మంది హిందీ మాట్లాడతారు. మనం హిందీ నేర్చుకోవాలి. హిందీ నేర్చుకుంటే ఎక్కువ మంది ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి. అంతే కాకుండా, హిందీ నేర్చుకోవడం వల్ల ఎక్కువ భాషలు నేర్చుకోవడం మరింత సులభం అవుతుంది’’ అని అన్నారు. అయితే ఇప్పటి వరకు అయితే గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై వ్యతిరేకత రాలేదు కానీ, ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇది కూడా అభ్యంతరకరంగా మారొచ్చని అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు