CCP Centenary Event : చైనా ఎంబసీ ఈవెంట్ లో పాల్గొన్న లెఫ్ట్ నేతలు..బీజేపీ తీవ్ర విమర్శలు

చైనాలోని అధికార చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ(CPC)ఇటీవల వందేళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

CCP Centenary Event : చైనా ఎంబసీ ఈవెంట్ లో పాల్గొన్న లెఫ్ట్ నేతలు..బీజేపీ తీవ్ర విమర్శలు

Ccp

CCP Centenary Event చైనాలోని అధికార చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ(CPC)ఇటీవల వందేళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సీపీసీ శతాబ్ది వేడుకలని పురస్కరించుకొని బుధవారం(జులై-28,2021) చైనా ఎంబసీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. సీపీఐ నేత డి.రాజా,సీపీఎం నేత సీతారాం ఏచూరి,ఎంపీ సెంథిల్ కుమార్ సహా మరికొందరు నేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనడం ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. కమ్యూనిస్ట్ నేతలపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

సీసీపీ శతజయంతి కార్యక్రమానికి లెఫ్ట్ పార్టీల నేతలు హాజరవడం చాలా దురదృష్టకరమని బీజేపీ ఎంపీ అనీల్ జైన్ తెలిపారు. లెఫ్ట్ నేతలు మొదట.. భారత్ తో ఉన్నారా లేక చైనాతో ఉన్నారా అనేది డిసైడ్ అవ్వాలన్నారు. ఇది మోసగించడమేననని.. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్.. దేశం యొక్క ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నది కాదని,దేశ ప్రజలకు ఇది లబ్ది చేకూర్చేదికాదని,లెఫ్ట్ నేతల బండారం దేశ ప్రజలకు తెలియాలని ఆయన పేర్కొన్నారు.

ఇక,మరో బీజేపీ నేత రీటా బహుగుణ జోషి..ఇదొక సిగ్గుమాలిన విషయంగా అభివర్ణించారు. ఇది అవమానకరమన్నారు. సరిహద్దులో చైనా ఏం చేసిందో లెఫ్ట్ నేతలు మర్చిపోకూడదన్నారు. చైనా-భారత్ సరిహద్దులో ఇంకా ఉద్రిక్త వాతావరణం నెలకొందన్నారు. చైనా పాకిస్తాన్ కి సాయం చేస్తుందని మరియు భయానక వాతావరణం సృష్టిస్తోందన్నారు. దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఇది లేదని,లెఫ్ట్ నేతలు చైనా నుంచి దూరంగా ఉండాలన్నారు.

అయితే బీజేపీ నేతల విమర్శలపై స్పందించిన సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వమ్..తన సహచర లెఫ్ట్ నేతలను వెనకేసుకొచ్చారు. ఇలాంటి మీటింగ్ లు సర్వసాధారణమన్నారు. కొందరు బీజేపీ నేతలు కూడా సీసీపీ నేతలతో మాట్లాడుతుండటం తాను చూశాన్నారు. అలాంటి మీటింగ్ లు ఇప్పుడు సర్వసాధామని తెలిపారు.

READ  Xi Jinping : కమ్యూనిస్ట్ పార్టీకి వందేళ్లు..చైనాతో పెట్టుకుంటే తలలు పగులుతాయ్!