Leopard Attack : ఏడేళ్ల బాలికపై చిరుత దాడి

చిరుత పులి దాడిలో ఏడేళ్ల చిన్నారి తీవ్ర గాయాలపాలైంది. ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. కాగా ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ జిల్లాలో జరిగింది.

Leopard Attack : ఏడేళ్ల బాలికపై చిరుత దాడి

Leopard Attack

Leopard Attack : చిరుత పులి దాడిలో ఏడేళ్ల చిన్నారి తీవ్ర గాయాలపాలైంది. ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. కాగా ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ జిల్లాలో జరిగింది. పిలిభిత్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలోని బారాహి శ్రేణికి సమీపంలో ఉన్న మజారా గ్రామంలో శుక్రవారం ఏడేండ్ల మన్ ప్రీత్ ఇంటి బయట ఆడుకుంటున్నది. వెనుకనుంచి వచ్చిన చిరుత ఒక్కసారిగా ఆ బాలికపై దాడి చేసింది.

బాలిక భయంతో కేకలు వేయడంతో ఆమె తల్లిదండ్రితోపాటు చుట్టుపక్కల వారు బయటకు వచ్చి గమనించి గట్టిగ కేకలు వేశారు. దీంతో బాలికను వదిలేసి అక్కడి నుంచి పారిపోయింది చిరుత. వెంటనే కుటుంబ సభ్యులు బాలికను ఆసుపత్రికి తరలించారు. బాలికకు బాగా రక్తం పోవడంతో పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇక చిరుత దాడిపై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అధికారి నవీన్ ఖండేల్వాల్ మాట్లాడుతూ పిలిభిత్ గ్రామంలో చిరుత దాడి చేయడం ఇదే తొలిసారని తెలిపారు. చిరుతను బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం వేళల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాధిత కుటుంబానికి పరిహారం చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు.