Viral Video: హమ్మయ్య బతికిపోయా.. మంచమెక్కి పైకొచ్చిన పులి.. వీడియో వైరల్

చిరుత పులి బావిలో పడింది. బావిలో నుంచి పులి గాండ్రింపులు వినిపించడంతో అటువెళ్లే వారు బావిలోకి చూడగా చిరుత పులి ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ‘మొహెంజో దారో హరప్పన్ టెక్నాలజీ’తో బావిలో నుంచి చిరుత పులిని బయటకు తీసి వదిలారు. బయటపడ్డ చిరుత హమ్మయ్య.. అనుకుంటూ అక్కడి నుంచి పరుగు లంకించుకొని అడవిలోకి వెళ్లిపోయింది.

Viral Video: హమ్మయ్య బతికిపోయా.. మంచమెక్కి పైకొచ్చిన పులి.. వీడియో వైరల్

Leopard

Viral Video: చిరుత పులి బావిలో పడింది. బావిలో నుంచి పులి గాండ్రింపులు వినిపించడంతో అటువెళ్లే వారు బావిలోకి చూడగా చిరుత పులి ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ‘మొహెంజో దారో హరప్పన్ టెక్నాలజీ’తో బావిలో నుంచి చిరుత పులిని బయటకు తీసి వదిలారు. బయటపడ్డ చిరుత హమ్మయ్య.. అనుకుంటూ అక్కడి నుంచి పరుగు లంకించుకొని అడవిలోకి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి సుశాంత నంద తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే విషయం తెలియపర్చలేదు. సుశాంత్ నంద తన ట్విటర్ ద్వారా ఓ మెస్సేజ్ ను అందించారు. జంతువుల ఆవాసాల చుట్టూ ఉన్న బావులకు పైకప్పును ఏర్పాటు చేసుకుంటే ఇటువంటి ఘటనలు ఉండవని పేర్కొన్నాడు.

Viral video: తన్నుకున్న టీచర్లు.. విద్యార్థులు ఏం చేశారంటే..! వీడియో వైరల్

సుశాంత్ నంద తన ట్విటర్ ఖాతాలో ఉంచిన వీడియోను కొద్ది గంటల్లోనే 50వేల మందికిపైగా నెటిజన్లు వీక్షించారు. చిరుతపులిని రక్షించేందుకు అటవీ అధికారులు ‘మొహెంజో దారో హరప్పన్ టెక్నాలజీ’ని వినియోగించారు. ఈ విధానం ద్వారా ఇనుప మంచాన్ని తీసుకొని, దానికి నాలుగు వైపుల తాళ్లుకట్టి బావిలో వదిలారు. బావి అడుగు భాగంకు వెళ్లగానే పులి ఆ మంచంపైకి ఎక్కడంతో పైనున్న వారు దానిని చిన్నగా పాకిలాగడం వీడియోలో కనిపించింది. ఒడ్డుకు చేరగానే పులి అక్కడి నుంచి పరుగులు లంకించుకొని అడవిలోకి పారిపోయినట్లు వీడియోలో ఉంది.

ఈ సందర్భంగా చిరుత పులిని కాపాడిన అటవీ సిబ్బంది పట్ల నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తూ రీట్వీట్లు చేశారు. ఇదే తరహాలో ఈనెల ప్రారంభంలో చిరుతపులిని బావిలో నుండి రక్షించినట్లు చూపించే మరొక వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో రాష్ట్ర అగ్నిమాపక శాఖ సహాయక చర్యలు చేపట్టి పులిని బావి నుంచి బయటకు తీశారు. ఆ వీడియోను 24వేల మంది వీక్షించారు.