Leopard Safe: హమ్మయ్య బతికిపోయా.. బావిలో పడి ప్రాణాలతో బయటపడ్డ చిరుత.. వీడియో వైరల్

బావిలో పడిన చిరుత పులి ఎట్టకేలకు తన ప్రాణాలను కాపాడుకుంది. అటవీ అధికారుల సహాయంతో నిచ్చెన ఎక్కుకుంటూ పైకెక్కింది.. హమయ్య ప్రాణాలతో బయటపడ్డా అనుకుంటూ దరిదాపుల్లో కనిపించకుండా పరుగు లంకించుకుంది.

Leopard Safe: హమ్మయ్య బతికిపోయా.. బావిలో పడి ప్రాణాలతో బయటపడ్డ చిరుత.. వీడియో వైరల్

Tiger

Leopard Safe: బావిలో పడిన చిరుత పులి ఎట్టకేలకు తన ప్రాణాలను కాపాడుకుంది. అటవీ అధికారుల సహాయంతో నిచ్చెన ఎక్కుకుంటూ పైకెక్కింది.. హమయ్య ప్రాణాలతో బయటపడ్డా అనుకుంటూ దరిదాపుల్లో కనిపించకుండా పరుగు లంకించుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఒడిశా రాష్ట్రం సంబల్‌పూర్ జిల్లా హిందోల్ ఘాట్ లో చోటు చేసుకుంది.

Leopard Attack: అర్ధరాత్రి పెంపుడు కుక్కపై చిరుత దాడి.. వీడియో వైరల్

హిందోల్ ఘాట్ సమీపంలోకి మంగళవారం సాయంత్రం వచ్చిన చిరుత ఉన్నట్లుండి పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. బావి లోతుగా ఉండటంతో పాటు నీళ్లు కూడా ఉండటంతో పైకి ఎక్కేందుకు అవకాశం లేకుండా పోయింది. అటువైపుగా వెళ్తున్న స్థానికులు పులి గాండ్రింపులు వినపడటంతో భయంతో చుట్టుపక్కల చూశారు. దగ్గరలోని బావి నుంచి ఆ అరుపులు వినిపిస్తుండటాన్ని గమనించి బావి వద్దకు వెళ్లి చూడగా బావిలో చిరుత పులి కనిపించింది. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలికి చేరుకున్న అటవీశాఖ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది తొలుత తాళ్ల సహాయంతో పులిని బయటకు లాగేందుకు ప్రయత్నించారు. కానీ ఉపయోగం లేకపోవటంతో నిచ్చెన సహాయంతో పులిని బయటకు తీశారు.

Monkeypox: మంకీపాక్స్ వ్యాప్తికి ప్రధాన కారణమేంటో చెప్పిన డబ్ల్యూహెచ్ఓ.. మీరూ పాటించండి..

నిచ్చెనకు తాళ్లను కట్టి బావిలోకి వదిలారు. దీంతో ఆ నిచ్చెనను పట్టుకున్న చిరుతపులి ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ పైకొచ్చింది. హమ్మయ్య బయటపడిపోయా అనుకుంటూనే దరిదాపుల్లో కనిపించకుండా ఒక్కసారిగా పరుగు లంకించుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయంపై స్థానిక అగ్నిమాపక అధికారి మిశ్రా కిషన్ మాట్లాడుతూ.. రాత్రి సమయంలో ఇటుగా వచ్చిన చిరుత బావిని గుర్తించక పడిపోయిందని తెలిపాడు. నిచ్చెన సహాయంతో బయటకు తీశామని, మళ్లీ అది స్థానిక అడవుల్లోకి వెళ్లిపోయిందని అన్నాడు.