Corona Cases: దేశంలోని 7 రాష్ట్రాల్లో వెయ్యి కంటే తక్కువ కేసులు

దేశంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతుంది. ఢిల్లీ, హర్యానాతో సహా 7 రాష్ట్రాల్లో 1,000 కంటే తక్కువ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.

Corona Cases: దేశంలోని 7 రాష్ట్రాల్లో వెయ్యి కంటే తక్కువ కేసులు

Corona Cases

Corona Cases: దేశంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతుంది. ఢిల్లీ, హర్యానాతో సహా 7 రాష్ట్రాల్లో 1,000 కంటే తక్కువ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. దేశంలోని కోవిడ్ పరిస్థితులపై సోమవారం మీడియాతో మాట్లాడారు హర్షవర్ధన్. దేశంలో ప్రస్తుతం 14,01,609 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని, కరోనా రికవరీ రేటు నిలకడగా పెరుగుతోందని చెప్పారు. 10 రాష్ట్రాల్లో 83 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయని, మిగతా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 17 శాతం యాక్టివ్ కేసులు ఉన్నట్లు వివరించారు.

మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఝార్ఖాండ్ రాష్ట్రాలు వెయ్యి కంటే తక్కువ కేసులు నమోదవుతున్న జాబితాలో ఉన్నాయని హర్షవర్ధన్ తెలిపారు. ఇక జమ్మూకశ్మీర్, పంజాబ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్‌లో 2,000 కంటే తక్కువగానే కరోనా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్ర కేరళల్లో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అన్నారు.

ఇక దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు లాక్ డౌన్ సడలింపుపై దృష్టిపెట్టాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ఫ్యూలో సడలింపులు ఇచ్చింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దుకాణాలు, ఇతర కార్యాలయాలు తెరిచేందుకు అనుమతించింది. ఈ సడలింపు జూన్ 10 నుంచి అమల్లోకి రానుంది. ఇక తెలంగాణలో కూడా లాక్ డౌన్ సడలింపులు ఇస్తారనే వార్తలు వస్తున్నాయి. మంగళవారం జరిగనున్న కేబినేట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.