Hijab Row : మా కుమార్తెలను హిజాబ్ ధరించనివ్వండి .. మీకు నచ్చితే బికినీలు ధరించండి : ఒవైసీ

కర్నాటక హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన అస్పష్టమైన తీర్పుపై ఏఐఎంఐఎం చీఫ్..ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. ముస్లిం బాలికల హిజాబ్‌ను బలవంతంగా తొలగించాలని కేంద్రం చూస్తోందంటూ మండిపడ్డారు.మా కుమార్తెలను హిజాబ్ ధరించనివ్వండి, మీకు నచ్చితే మీరు మీ బికినీలు ధరించండి...’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

Hijab Row : మా కుమార్తెలను హిజాబ్ ధరించనివ్వండి .. మీకు నచ్చితే బికినీలు ధరించండి : ఒవైసీ

let our daughter aimim chief asaduddin owaisi said wear hijab you wear bikinis

Hijab Row : కర్నాటక హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన అస్పష్టమైన తీర్పుపై ఏఐఎంఐఎం చీఫ్..ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. ముస్లిం బాలికల హిజాబ్‌ను బలవంతంగా తొలగించాలని కేంద్రం చూస్తోందంటూ మండిపడ్డారు.గోల్కొండ కోటలో ఒక సభతో తన ఇంటరాక్షన్ సందర్భంగా హిజాబ్ ఒవైసీ అంశాన్ని ప్రస్తావిస్తూ..“ముస్లింలు చిన్న పిల్లలను హిజాబ్ ధరించమని బలవంతం చేస్తున్నారని వారు అంటున్నారు. మేము నిజంగా మా అమ్మాయిలను బలవంతం చేస్తున్నామా?అంటూ ప్రశ్నించారు. మా కుమార్తెలను హిజాబ్ ధరించనివ్వండి, మీకు నచ్చితే మీరు మీ బికినీలు ధరించండి…’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హిజాబ్ ముస్లింల వెనుకబాటుతనాన్ని చూపుతుందా?ముస్లిం మహిళలు దేశ అభివృద్ధికి సహకరించడం లేదా? అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. ముస్లిం మహిళల్లో ఉండే ప్రతిభను ఎవ్వరు గుర్తించటంలేదని కేవలం సంప్రదాయంగా మారు వేసుకునే వేషధారణలను మాత్రమే చూస్తున్నారని..ముస్లిం మహిళలు ప్రతిభ హైదరాబాద్ లోనే అన్ని ప్రాంతాల్లోను కనిపిస్తుందని అన్న ఒవైసీ మీరు హైదరాబాద్‌కు వస్తే మా అక్కాచెల్లెళ్లలో పేరుమోసిన డ్రైవర్లను చూస్తారు అన్ని అన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కర్నాటక హిజాబ్ నిషేధాన్ని ప్రస్తావించిన ఒవైసీ ఒక హిందువు, సిక్కు, క్రైస్తవ విద్యార్థిని వారి మతపరమైన దుస్తులతో తరగతి గదిలోకి రావటానికి ఏమాత్రం అభ్యంతరం పెట్టటంలేదు..కానీ కేవలం ముస్లిం విద్యార్ధినులను మాత్రమే ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు? అంటూ ప్రశ్నించారు. ఆ సమయంలో మిగితా విద్యార్థులు ముస్లిం విద్యార్థి గురించి ఏమనుకుంటున్నారు? సహజంగానే వారు ముస్లింలు మనకంటే దిగువన ఉన్నారని అనుకుంటారని అన్నారు.

విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో ఒకరు కొట్టివేయగా, మరొకరు స్వాగతించారు. స్కూల్స్, కాలేజీలలో యూనిఫాం నిబంధనలను కఠినంగా అమలు చేయాలన్న కర్ణాటక ప్రభుత్వ ఉత్తర్వులను సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివిధ పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

2022 జనవరిలో ఉడిపిలోని ప్రభుత్వ పీయూ కళాశాలలో హిజాబ్ ధరించిన ఆరుగురు బాలికలను లోనికి రానీయకుండా నిషేధించడంతో హిజాబ్ వివాదం మొదలైంది. దీంతో కాలేజీలో ప్రవేశం నిరాకరిస్తూ బాలికలు కళాశాల బయట బైఠాయించి నిరసన తెలిపారు. తరువాత ఉడిపిలోని అనేక కాలేజీల్లో ముస్లిం హిజాబ్ ను వ్యతిరేకిస్తూ..విద్యార్ధులు కాషాయ కండువాలు ధరించి క్లాస్ రూములకు వచ్చి నిరసన వ్యక్తంచేశారు. ఈ నిరసన రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించింది. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ లో కూడా హిజాబ్ ధరించిన ముస్లిం యువతులను క్లాస్ రూమ్ లోకి రాకుండా అడ్డుకున్న ఘటనలు జరిగాయి.