Shiv Sena MLA : మళ్లీ బీజేపీతో కలుద్దాం..సీఎంకి శివసేన ఎమ్మెల్యే లేఖ

ఆలస్యం కాకముందే మళ్లీ బీజేపీ మరియుప్రధాని మోదీతో చేతులు కలపుదామంటూ శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు ఆదివారం ఓ లేఖ రాశారు.

Shiv Sena MLA : మళ్లీ  బీజేపీతో కలుద్దాం..సీఎంకి శివసేన ఎమ్మెల్యే లేఖ

Lets Reconcile With Bjp Modi Before Its Too Late Sena Mla Writes To Uddhav Thackeray

Shiv Sena MLA ఆలస్యం కాకముందే మళ్లీ బీజేపీ మరియుప్రధాని మోదీతో చేతులు కలపుదామంటూ శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు ఆదివారం ఓ లేఖ రాశారు. బీజేపీతో చేతులు కలపడం వల్ల… కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు వేధింపుల నుంచి తనలాంటి శివసేన నేతలు బయటపడతారని ఆ లేఖలో ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరు పార్టీలు మిత్రపక్షాలు కాకపోయినప్పటికీ.. బీజేపీకి చెందిన అనేక మంది నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయని.. వాటిని ఉపయోగించుకొని బీజేపీకి దగ్గర కావాలని సూచించారు. త్వరలో ముంబై, థానే సహా పలు కార్పొరేషన్ ల ఎన్నికలు రాబోతున్నాయని వాటిలో సహకారం కోసమైనా బీజేపీతో సంబంధాల్ని పునరుద్ధరించుకోవాలని సర్నాయక్‌ కోరారు.

ప్రస్తుతం ఇరు పార్టీలు మిత్రపక్షాలు కాకపోయినప్పటికీ.. బీజేపీకి చెందిన అనేక మంది నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయని.. వాటిని ఉపయోగించుకొని బీజేపీకి దగ్గర కావాలని సూచించారు. ఈ సందర్భంగా మిత్రపక్షాలపై సర్నాయక్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయనుందని తెలిపారు. అలాగే మరో భాగస్వామ్య పక్షం ఎన్సీపీ.. శివసేన ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాగా, గత ఏడాది సర్నాయక్‌కు చెందిన పలు ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ తనిఖీలు నిర్వహించింది. ఆయన కుమారుడు విహంగ్‌ సర్నాయక్‌ని కూడా అధికారులు ప్రశ్నించారు.

కాగా, గతంలో బీజేపీ, శివసేన కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం సీటుపై వివాదం నెలకొని ఇరు పార్టీలు తెగతెంపులు చేసుకున్నాయి. తర్వాత కాంగ్రెస్‌, ఎన్సీపీతో కలిసి శివసేన ‘మహా వికాస్‌ ఆఘాడీ’ కూటమి ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని నెలకొల్పిన విషయం తెలిసిందే.