LIC public Alert : పాలసీ దారులను అలర్ట్ చేసిన ఎల్ఐసీ

ప్రముఖ బీమా రంగ సంస్ధ ఎల్ఐసీ ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. కరోనా లాక్ డౌన్ సమయాల్లో తన పాలసీ దారులకు సంస్ధ గురించి సమచారాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అందిస్తూ అందుబాటులో ఉంటోంది.

LIC public Alert : పాలసీ దారులను అలర్ట్ చేసిన ఎల్ఐసీ

Lic Public Alert

LIC public Alert : ప్రముఖ బీమా రంగ సంస్ధ ఎల్ఐసీ ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. కరోనా లాక్ డౌన్ సమయాల్లో తన పాలసీ దారులకు సంస్ధ గురించి సమచారాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అందిస్తూ అందుబాటులో ఉంటోంది. తాజాగా సంస్ధ లోగో గురించి ఆన్ లైన్ మోసాల గురించి తన పాలసీ దారులను హెచ్చరిస్తూ రెండు అప్ డేట్స్ ఇచ్చింది.

కంపెనీ అనుమతిలేకుండా ఎవరూ లోగోను వాడరాదని హెచ్చరిక జారీ చేసింది. ఎల్ఐసీ అనుమతి లేకుండా లోగోవాడటం నేరమని… ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ వేదికగా హెచ్చరించింది. ఇతర వ్యాపారస్తులు కానీ, వెబ్‌సైట్ కానీ ఇతరులు ఎవ్వర కూడా కంపెనీ అనుమతిలేనిదే లోగో ఉపయోగించరాదని తెలిపింది.

మరోక విషయంలో పాలసీదారులను అప్రమత్తం చేసింది. మోసగాళ్లనుంచి జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఎల్ఐసీ అధికారులు పాలసీదారులకు ఫోన్ చేసి పాలసీ నెంబర్లు, పాన్ నెంబర్లు, నామినీ పేర్లు అడగరని .. అలాంటికాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఎల్ఐసీకి సంబంధించి అనుమానిత కాల్స్ లేదా ఈ మెయిల్స్ వస్తే వాటి గురించి spuriouscalls@licindia.comకు తెలియజేయాలని కోరింది. ఖాతాదారులకు అందుబాటులో ఉండే కాల్ సెంటర్ నెంబర్లు కూడా తెలిపింది. ఏదైనా అనుమానం వస్తే 022-6827 6827 నెంబర్‌కు కాల్ చేయొచ్చు. సందేహాలను పరిష్కరించుకోవచ్చని తెలిపింది.