LIC : నేడే ఎల్ఐసీ ఐపీఓ లిస్టింగ్

పాలసీదారులకు డిస్కౌంట్‌ పోగా 889, రీటైల్ ఇన్వెస్టర్లకు 904, ఇతరులకు 949 రూపాయల వద్ద షేర్లు కేటాయించింది. మొత్తం 22 కోట్లకు పైగా షేర్లను విక్రయించి 20 వేల 557కోట్ల రూపాయలు సేకరించింది.

LIC : నేడే ఎల్ఐసీ ఐపీఓ లిస్టింగ్

Lic Ipo (1)

LIC IPO listing : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచిన ఎల్‌ఐసీ షేర్లు ఇవాళ స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు కానున్నాయి. ఈ బీమా దిగ్గజంపై నమ్మకంతో బిడ్లు దాఖలు చేసిన లక్షలాది మంది మదుపర్లు ఎల్‌ఐసీ లిస్టింగ్‌ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే…ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లోకి కూరుకుపోయిన తరుణంలో ఎల్‌ఐసీ లిస్ట్‌ కానుండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ సందర్భంగా ధరల శ్రేణిలో తుది ధర 9వందల 49రూపాయలుగా ఖరారు చేసింది.

పాలసీదారులకు డిస్కౌంట్‌ పోగా 889, రీటైల్ ఇన్వెస్టర్లకు 904, ఇతరులకు 949 రూపాయల వద్ద షేర్లు కేటాయించింది. మొత్తం 22 కోట్లకు పైగా షేర్లను విక్రయించి 20 వేల 557కోట్ల రూపాయలు సేకరించింది. ఇవాళ ఈ షేర్లు ఓపెన్‌ మార్కెట్‌లో ట్రేడ్‌ కాబోతున్నాయి. మార్కెట్‌ నిపుణులు మాత్రం భారీ ప్రీమియమ్‌తో లిస్ట్‌ అవుతుందని ఆశలు పెట్టుకోవద్దనే హెచ్చరిస్తున్నారు.
LIC IPO: పబ్లిక్ ఇష్యూకు ఎల్ఐసీ.. దరఖాస్తు చేసుకోండి మరి

యుక్రెయిన్‌ యుద్ధం తర్వాత మారిన అంతర్జాతీయ పరిణామాలు, ప్రపంచమార్కెట్లపై ఒత్తిడి, రోజురోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, దేశీయ మార్కెట్ల నుంచి FIIలు తరలిపోవడంతో దెబ్బతిన్న మార్కెట్‌ సెంటిమెంట్ వంటి అంశాలను పరిశీలనలోకి తీసుకుంటే LIC షేరు ధర తక్కువకే లిస్ట్‌ కావొచ్చని చెబుతున్నారు. LIC ఇష్యూ ధరను 949 రూపాయలుగా తీసుకుంటే మార్కెట్‌లో 20 నుంచి 30రూపాయల తక్కువకు లిస్టవుతుందన్నది గ్రే మార్కెట్ అంచనా. అదే జరిగితే లిస్టింగ్‌ అయిన తొలిరోజే ఇన్సూరెన్స్ దిగ్గజం నిరాశపరిచినట్లే.