LIC IPO Listing: నిరాశపర్చిన ఎల్‌ఐసీ లిస్టింగ్‌.. త‌క్కువ ధ‌ర‌కు షేర్ల ట్రేడింగ్‌

ఎల్ఐసీ ఐపీవో షేర్లు మంగళవారం మార్కెట్లలో లిస్టయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బీఎస్ఈ), నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌(ఎన్ఎస్ఈ)లో ఎల్ఐసీ ట్రేడింగ్ జ‌రిగింది. అయితే భారీ ఆశలు పెట్టుకున్న మదుపర్లకు ...

LIC IPO Listing: నిరాశపర్చిన ఎల్‌ఐసీ లిస్టింగ్‌.. త‌క్కువ ధ‌ర‌కు షేర్ల ట్రేడింగ్‌

Lic

LIC IPO Listing: ఎల్ఐసీ ఐపీవో షేర్లు మంగళవారం మార్కెట్లలో లిస్టయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బీఎస్ఈ), నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌(ఎన్ఎస్ఈ)లో ఎల్ఐసీ ట్రేడింగ్ జ‌రిగింది. అయితే భారీ ఆశలు పెట్టుకున్న మదుపర్లకు నిరాశ తప్పలేదు. మదుపర్లు ఊహించిన దానికంటే తక్కువగా షేర్లు ట్రేడింగ్ కావటం వారిలో తీవ్ర నిరాశను కలిగించింది. ఎన్ఎస్ఈలో ఈ షేరు ఇష్యూ ధర రూ. 949తో పోలిస్తే 8.11శాతం నష్టంతో రూ. 872 వద్ద లిస్టయింది. ఈ లెక్కన కనీసం ఒకలాట్ అంటే 15షేర్లు కు రూ. 14,235 పెట్టుబడిగా పెట్టిన మదుపర్లకు రూ.1,155 లిస్టింగ్ లాస్ ఏర్పడింది. భారతీయ కాలమానం ప్రకారం.. ఉదయం 11.25 గంటలకు బీమా బెహెమోత్ షేర్లు పాలసీదారుల ధర ₹ 889 వద్ద చివరిగా ట్రేడింగ్ చేయబడ్డాయి, దాని లిస్టింగ్ ధర నుండి దాదాపు 2.5 శాతం లాభం మరియు ఇష్యూ ధర కంటే 6శాతం తక్కువ. ఉదయం ట్రేడింగ్‌లో షేర్ గరిష్టంగా ₹ 920కి పెరిగింది.

LIC : నేడే ఎల్ఐసీ ఐపీఓ లిస్టింగ్

జీవిత బీమా సంస్థ‌(ఎల్ఐసీ) మంగళవారం స్టాక్ మార్కెట్లోకి ప్ర‌వేశించిన విషయం విధితమే. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచిన ఎల్‌ఐసీ గరిష్ఠ ధర వద్ద రూ.20,557 కోట్లు సమీకరించింది. ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో ఎల్‌ఐసీ షేర్లు లిస్టింగ్‌కు రావడం ప్రతికూలాంశంగా మారింది. మరోవైపు ఆర్థిక నిపుణులు, మార్కెట్‌ విశ్లేషకులు మాత్రం ఎల్‌ఐసీ దీర్ఘకాలంలో మంచి లాభాలిస్తుందని సూచిస్తున్నారు. మదుపర్లు ఏమాత్రం తొందరపడొద్దని.. దీర్ఘకాల వ్యూహంతో ముందుకెళ్లాలని సలహా ఇస్తున్నారు.