Cinema Halls Opend In Kashmir: 32ఏళ్ల తరువాత.. కశ్మీర్‌లో తెరుచుకున్న సినిమా హాళ్లు.. ఏఏ ప్రాంతాల్లో అంటే..

32ఏళ్ల తర్వాత కశ్మీర్‌లో సినిమా హాల్స్ తెరుచుకున్నాయి. ఫుల్వామా, షోపియాన్ జిల్లాల్లో ఆదివారం మల్టీపర్సస్ సినిమా హాళ్లను జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. ఇది చారిత్రాత్మక ఘటన అని మనోజ్ సిన్హా అభివర్ణించారు.

Cinema Halls Opend In Kashmir: 32ఏళ్ల తరువాత.. కశ్మీర్‌లో తెరుచుకున్న సినిమా హాళ్లు.. ఏఏ ప్రాంతాల్లో అంటే..

CINEMA HALLS IN PULWAMA

Cinema Halls Opend In Kashmir: 32ఏళ్ల తర్వాత కశ్మీర్‌లో సినిమా హాల్స్ తెరుచుకున్నాయి. ఫుల్వామా, షోపియాన్ జిల్లాల్లో ఆదివారం మల్టీపర్సస్ సినిమా హాళ్లను జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. ఇది చారిత్రాత్మక ఘటన అని మనోజ్ సిన్హా అభివర్ణించారు. అయితే వచ్చేవారం కశ్మీర్‌లో తొలి ఐమాక్స్ మల్టీఫ్లెక్స్ ప్రారంభం కానుంది. శ్రీనగర్‌లోని సోమ్‌వార్ ప్రాంతంలో దీన్ని తెరవనున్నారు. ఇందులో 520 సీట్ల సామర్థ్యం కలిగిన మూడు స్ర్కీన్లు ఇందులో ఉండనున్నాయి.

Jammu and Kashmir: ఆర్టికల్ 370పై సంచలన ప్రకటన చేసిన గులాం నబీ ఆజాద్

1990లో జమ్మూ అండ్ కశ్మీర్ లో ఇస్లామిక్ ఉగ్రవాదం ప్రారంభమయ్యే ముందు.. లోయలో శ్రీనగర్, అనంతనాగ్, బారాముల్లా, సోపోర్, హంద్వారా, కుప్వారాలో 19సినిమా హాళ్లు ఉన్నాయి. ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు రావడంతో క్రమంగా ఇవి మూతపడ్డాయి. ప్రస్తుతం ఇవి శిథిలావస్థకు చేరుకున్నాయి. వివిధ వాణిజ్య ప్రయోజనాల కోసం వీటిని వినియోగిస్తున్నారు. అయితే, 1999లో ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం రీగల్, నీలం, బ్రాడ్‌వే సినిమాలను చిత్రీకరించడానికి అనుమతించడం ద్వారా సినిమా థియేటర్‌లను పునరుద్ధరించడానికి ప్రయత్నం జరిగింది. రిగాల్ సినిమా థియేటర్‌లో తొలి షో సందర్భంగా ఉగ్రవాదులు దాడిచేశారు. ఈ ఉగ్రదాడిలో ఒకరు మృతి చెందగా, పన్నెండు మంది గాయపడ్డారు. సినిమా హాల్‌పై ఉగ్రవాదులు మూడు హ్యాండ్ గ్రెనేడ్‌లతో దాడి చేశారు, ఫలితంగా థియేటర్లకు మరోసారి తాళాలు వేశారు.

చిత్ర నిర్మాతలను ప్రోత్సహించేందుకు జమ్మూ కాశ్మీర్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ స్థాపించబడిన కొన్ని నెలల తర్వాత, జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వం మొదటి చలనచిత్ర విధానాన్ని ఆగస్టు 2021లో విడుదల చేసింది. మూతపడిన సినిమా హాళ్లను తిరిగి తెరవడం, లోయలో మల్టీప్లెక్స్‌లను ఏర్పాటు చేయడం ముఖ్య లక్ష్యాలుగా నిర్ధేశించారు. ఇదిలాఉంటే థియేటర్ల ప్రారంభం సందర్భంగా అధికారులు కీలక ప్రకటన చేశారు. అనంత్ నాగ్, శ్రీనగర్, బందిపోరా, గందర్ బల్, దోడా, రాజౌరి, పూంచ్, కిష్ట్యార్, రియాసీలలో త్వరలో థియేటర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.