Delhi : వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేయాలి.. ప్రతిపాదనకు లెఫ్టినెంట్ గవర్నర్‌‌ నో

కేజ్రీవాల్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం వేయలేదు. అయితే..50 శాతం సామర్థ్యంతో ప్రైవేట్ కార్యాలయాలను తిరిగి తెరవడానికి ఆయన అనుమతించారు....

Delhi : వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేయాలి.. ప్రతిపాదనకు లెఫ్టినెంట్ గవర్నర్‌‌ నో

Covid In Delhi

Lieutenant Governor Rejects : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండడంతో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అమలు చేస్తున్న వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేయాలని..ఇందుకు ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం లెఫ్టినెంట్ గవర్నకు సిఫార్సు చేసింది. ప్రతిపాదనలను ఆయన కార్యాలయానికి పంపింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు వారాంతపు కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ..ప్రస్తుతం కరోనా కంట్రోల్ కి రావడంతో లెఫ్టినెంట్ గవర్నకు ప్రతిపాదనలు పంపింది. వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న ప్రైవేటు ఉద్యోగులు ఆఫీసుల్లో 50 శాతం సామర్థ్యంతో పనిచేసేలా, సరి, సంఖ్య బేసి విధానం రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపింది. కేజ్రీవాల్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం వేయలేదు. అయితే..50 శాతం సామర్థ్యంతో ప్రైవేట్ కార్యాలయాలను తిరిగి తెరవడానికి ఆయన అనుమతించారు.

Read More : Medical Services : ఒక్క ఫోన్ కాల్ తో ఇంటి వద్దకే వైద్య సేవలు

మరోవైపు… ఢిల్లీలో గురువారం 12 వేల 306 కొత్త కేసులు నమోదయ్యాయి. 43 మంది చనిపోయారు. జనవరి 14వ తేదీన దాదాపు 30వేల గరిష్ట స్థాయి కరోనా కేసులు వెలుగు చూస్తే…గురువారం 12 వేల కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో కరోనా తగ్గుముఖం పడుతోందని భావిస్తోంది అక్కడి ప్రభుత్వం. ఢిల్లీలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 70వేలు ఉన్నట్లు తెలుస్తోంది.

Read More : Gudiwada Casino : గుడివాడలో క్యాసినో వివాదం.. ఈడీ విచారణకు టీడీపీ డిమాండ్

అయితే..భారతదేశంలో కరోనా మళ్లీ డేంజర్ బెల్స్‌ మోగిస్తోంది.. వరుసగా రెండో రోజు కరోనా కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది.. అన్ని రాష్ట్రాల్లో కలిపి 3 లక్షల 47 వేల 254 కేసులు నమోదయయ్యాయి. గురువారంతో పోలిస్తే 30 వేల కేసులు అధికంగా నమోదయ్యాయి.. మొన్నటితో పోలిస్తే కేసుల పెరుగుదల సంఖ్య 97 వేలకు చేరింది. ఇక ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 9వేల 692 చేరింది. ఇక గురువారంతో పోలిస్తే మరణాల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. కరోనాతో 703 మంది మరణించారని గణాంకాలు చెబుతున్నాయి. పాజిటివిటీ రేటు 16.56 శాతానికి చేరింది. రికవరీ రేటు 93.50 శాతానికి పడిపోయింది.

Read More : Samantha: సామ్ ఛలో ముంబై.. బాలీవుడ్‌లో బేబీ దూకుడు!

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, కర్ణాటకలో కేసుల సంఖ్య ఆల్‌టైమ్‌ హైకు చేరుకున్నాయి.. కేరళలో గురువారం గరిష్టంగా 47 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఫస్ట్‌, సెకండ్ వేవ్‌ల సమయంలో కూడా ఇంత భారీ స్థాయిలో ఆ రాష్ట్రంలో కేసులు నమోదు కాలేదు. దీంతో కరోనా కట్టడికి చర్యలను మరింత పకడ్బంధిగా అమలు చేయాలని నిర్ణయించారు అధికారులు.