India 1st City : అంతర్జాతీయ నగరాల జాబితాలో పూరి..! ఏ విషయంలోనో తెలుసా…?

పూరీ జగన్నాథుడు కొలువైన పూరీ నగరం అరుదైన ఘనతను సాధించింది.లండన్, న్యూయార్క్, సింగపూర్ వంటి అంతర్జాతీయ నగరాల్లో వలెనే రోజంతా అంటే 24 గంటలు మంచినీటి సరఫరాను అందించే నగరంగా పేరొందింది. ఎటువంటి ఫిల్టర్ చేయకుండానే పరిశుభ్రమైన నీటిని 24గంటలు అందించనుంది. సుజల్ పేరిట ‘డ్రింక్ ఫ్రం ట్యాప్’ మిషన్ పథకాన్ని ఒడిశా ప్రభుత్వం భారతదేశంలోనే మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది.

India 1st City : అంతర్జాతీయ నగరాల జాబితాలో పూరి..! ఏ విషయంలోనో తెలుసా…?

Puri Is The First City In India 24 Hours Drinking Water

Puri is the first city in India 24 hours Drinking water : పూరీ జగన్నాథుడు కొలువైన పూరీ నగరం అరుదైన ఘనతను సాధించింది.లండన్, న్యూయార్క్, సింగపూర్ వంటి అంతర్జాతీయ నగరాల్లో వలెనే రోజంతా అంటే 24 గంటలు మంచినీటి సరఫరాను అందించే నగరంగా పేరొందింది. ఎటువంటి ఫిల్టర్ చేయకుండానే పరిశుభ్రమైన నీటిని 24గంటలు అందించనుంది. సుజల్ పేరిట ‘డ్రింక్ ఫ్రం ట్యాప్’ మిషన్ పథకాన్ని ఒడిశా ప్రభుత్వం భారతదేశంలోనే మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది.

మొట్టమొదటిసారి ఒడిశా రాష్ట్రంలోని పూరి నగరంలో ఎలాంటి వడపోత అవసరం లేకుండా పరిశుభ్రమైన మంచినీటిని నేరుగా నల్లా నుంచి తాగేందుకు వీలుగా డ్రింక్ ఫ్రం ట్యాప్ మిషన్‌ పథకాన్ని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. లండన్, న్యూయార్క్, సింగపూర్ వంటి అంతర్జాతీయ నగరాల్లోలాగా మున్సిపల్ నల్లాల నుంచి రోజంతా 24 గంటలపాటు నాణ్యమైన తాగునీటిని సరఫరా చేయడం ద్వారా పూరి నగరాన్ని అంతర్జాతీయ నగరాల సరసన చేర్చామని తెలిపారు.

ఈ విధానంతో పూరి నగరంలోని రెండున్నర లక్షల మంది ప్రజలకు పరిశుభ్రమైన తాగునీటిని అందిస్తున్నారు. ఒడిశా చరిత్రలోనే పూరి నగరం చరిత్రలోనే కొత్త అధ్యాయానికి నాంది పలికిందని, ఎలాంటి వడపోత అవసరం లేకుండానే మంచినీటిని నల్లా నుంచి నేరుగా తాగవచ్చని సీఎం వెల్లడించారు. పూరిలోని సుజల పథకం వల్ల ప్రతీ సంవత్సరం వచ్చే 2.5 కోట్ల మంది పర్యాటకులకు ప్రయోజనం లభిస్తుందని..ఇకనుంచి నగరవాసులు ప్రత్యేకించి తాగటానికి బాటిల్స్ లో వాటర్ పట్టుకెళ్లాల్సిన పనిలేదని అన్నారు.

సురక్షితమైన తాగునీరు అందించడం మూడు కోట్ల ప్లాస్టిక్ సీసాల వాడకాన్ని నిరోధించడానికి, 400 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడానికి మరియు రాష్ట్ర కార్బన్ పాదముద్రను తగ్గించటానికి సహాయపడుతుందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి సౌకర్యం కేవలం కొన్ని నగరాల్లో మాత్రమే ఉందన్నారు. పూరి నివాసితులేకాకుండా ఇకనుంచి పూరీని సందర్శించే పర్యాటకులు, భక్తులు నగరం ఎక్కడైనా సరే సురక్షితమైన నీటిని తాగవచ్చని అని సీఎం నవీన్ పట్నాయక్ అన్నారు.