సెక్యూరిటీ లేకుండా తిరిగే నేను సింహాన్ని: ఒవైసీ

సెక్యూరిటీ లేకుండా తిరిగే నేను సింహాన్ని: ఒవైసీ

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఔరంగాబాద్ లోని పైథాన్ గేట్ ప్రాతంలో జరిగిన ఎన్నికల ప్రచారం సభలో పాల్గొని ప్రసంగించారు. ఒవైసీని పాముతో పోల్చి కామెంట్ చేయడంపై కౌంటర్ వేశారు. తాను పామును కాదని సింహాన్ని అంటూ విరుచుకుపడ్డారు. ఒవైసీ వ్యాఖ్యలకు సభ మొత్తం ఫుల్ జోష్‌లో కనిపించింది. 

సభలో మాట్లాడుతూ.. ‘అసదుద్దీన్ ఒవైసీ పాములా తిరగడు. హిందూస్తాన్ పార్లమెంట్ లో సెక్యూరిటీ లేకుండా తిరిగే వ్యక్తిని నేను. అంతేకాదు మీకు ఒక ఛాలెంజ్ విసురుతున్నాను. సెక్యూరిటీ లేకుండా మీ ఇంట్లో నుంచి బయటకురా చూద్దాం. నువ్వు కానీ, నీ పార్టీ వాళ్లు కానీ, నా లాగా తిరగలేరు. అంత మంది సెక్యూరిటీ గార్డులతో తిరిగే మీరు నాకు చెప్తారా.. మీ లాంటి 35పాములను చిటికె వేసి ఆడించగలను. ఎక్కువ చేస్తే వాటి విషం పీకి పారేయగలను’ అని కౌంటర్ విసిరారు. 

మహారాష్ట్ర, హార్యానా శాసనసభలతో సహా 17 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్ధానాల ఉప ఎన్నికల ప్రచారానికి శనివారం అక్టోబరు19వ తేదీ సాయంత్రం తెర పడింది. 17రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ, 2పార్లమెంట్ స్థానాలకు ప్రచారం ముగిసింది. అక్టోబరు 21న ఎన్నికలు జరుగుతుండగా అక్టోబరు 24న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.