వైద్య రంగానికి మాత్రమే..ఆక్సిజన్ వినియోగంపై కేంద్రం కీలక ఆదేశాలు

దేశంలో కొవిడ్​ కొవిడ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్​ వినియోగంపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది.

వైద్య రంగానికి మాత్రమే..ఆక్సిజన్ వినియోగంపై కేంద్రం కీలక ఆదేశాలు

Liquid Oxygen

Liquid Oxygen దేశంలో కొవిడ్​ కొవిడ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్​ వినియోగంపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా అన్ని పరిశ్రమల్లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ వినియోగంపై కేంద్రం నిషేధం విధించింది. వైద్య రంగం కోసం కాకుండా..మరే ఇతర పరిశ్రమల్లో లిక్విడ్​ ఆక్సిజన్​ వాడకాన్ని అనుమతించకూడదని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. ఏ పరిశ్రమకు దీని నుంచి మినహాయింపు లేదని సృష్టం చేసింది.

ఆక్సిజన్​ తయారీ ప్లాంట్లు గరిష్ఠ స్థాయిలో ఆక్సిజన్ ఉత్పత్తి చేయాలని కోరింది. వాటిని తక్షణమే వైద్య వినియోగం కోసం అందజేయాలని కేంద్ర హోంశాఖ తన ఆదేశాలలో పేర్కొంది. కాగా, ఇప్పటికే వివిధ పరిశ్రమల నుంచి ఆక్సిజన్‌ ఉత్పత్తిని ప్రారంభించి వైద్య అవసరాలకు వినియోగిస్తున్నారు. అయినా, కొన్ని పరిశ్రమలు ఇంకా ఉత్పత్తి కార్యకలాపాలకు ఆక్సిజన్‌ను వినియోగిస్తున్న నేపథ్యంలో కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు, దేశవ్యాప్తంగా ఆక్సిజన్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. డీఆర్డీవో టెక్నాలజీ అయిన ప్రెజర్ స్వింగ్ అడ్జార్ప్షన్ (పీఎస్ఏ) ద్వారా ఆక్సిజన్ ను తయారు చేసే 551 ప్లాంట్లను నిర్మించబోతోంది. ఇందుకోసం పీఎం కేర్స్ నిధులను వినియోగించనుంది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. వీలైనంత త్వరగా ఆ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధాని మోడీ ఆదేశించారని పేర్కొంది. ఆ ప్లాంట్లు అందుబాటులోకి వస్తే జిల్లా స్థాయిలో ఆక్సిజన్ సరఫరా పెరుగుతుందని తెలిపింది. జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారని చెప్పింది. ఆక్సిజన్ సేకరణ కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పింది.