Liquor Online: ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు

ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు జరిపేందుకు అస్సాం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు గువాహటిలో జరిగిన సమావేశంలో ప్రయోగాత్మకంగా ఓ నెల రోజుల పాటు ప్లాన్ చేసినట్లు బుధవారం అస్సాం మంత్రి పీజుష్ హజారిక ప్రకటించారు.

Liquor Online: ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు

Liqour Online Sales

Liquor Online: ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు జరిపేందుకు అస్సాం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు గువాహటిలో జరిగిన సమావేశంలో ప్రయోగాత్మకంగా ఓ నెల రోజుల పాటు ప్లాన్ చేసినట్లు బుధవారం అస్సాం మంత్రి పీజుష్ హజారిక ప్రకటించారు.

‘గువాహటిలో నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా మద్యాన్ని ఆన్ లైన్ లో అమ్మాలని అస్సాం కేబినెట్ నిర్ణయించింది. ఇది సక్సెస్ అయితే రాష్టమంతా అమలు చేసేందుకు ప్లాన్ చేస్తాం’ అని అన్నారు.

ఈ మేర సీఎం హిమంత విశ్వ శర్మ ట్విట్టర్ వేదికగా.. అస్సాం కేబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ప్రాంతాలకు రిలీఫ్ అందించడంతో పాటు విద్యను వృద్ధి చేయాలనుకుంటున్నాం. పునాది స్థాయి నుంచే విద్యను అందించడం, ఎకనామిక్ యాక్టివిటీస్ పెంచి టీ గార్డెన్, రూరల్ ప్రాంతాల్లో యాక్టివిటీస్ మెరుగు చేయాలనుకుంటున్నట్లు శర్మ బుధవారం ట్వీట్ చేశారు.

ఎమ్ఎన్ఆర్ఈజీఏ ప్రకారం.. శీతాకాలంలో టీ గార్డెన్స్ లో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉంటాయి. వారి కోసం రోడ్ నిర్మాణ పనులు, నీటిని శుభ్రపరచడం వంటివి ప్లాన్ చేయాలని నిర్ణయించారు.