పోలీసులపై కుక్కను వదిలిన లిక్కర్ వ్యాపారి

  • Published By: madhu ,Published On : September 1, 2020 / 11:50 AM IST
పోలీసులపై కుక్కను వదిలిన లిక్కర్ వ్యాపారి

అరెస్టు నుంచి తప్పించుకొనేందుకు పోలీసులపైకి తన పెంపుడు కుక్కను వదిలాడు ఓ లిక్కర్ వ్యాపారి. గుజరాత్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కానిస్టేబుల్ ఎడమ చేతిని కుక్క కరిచేసింది.



కొడాల పీఎస్ పరిధిలో కరోనా కేసులు ఎక్కువవుతుడడంతో కారణంగా…గంజాంలో వారం రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. కానీ..వ్యాపార రబీ నహక్ చికెన్, లిక్కర్ సేల్స్ చేసినట్లు ఆరోపణలున్నాయి. విచారణ అనంతరం అదుపులోకి తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు.
https://10tv.in/not-six-pack-its-liquor-pack-tiruvuru-police-arrest-two-carrying-liquor-bottles/
శనివారం సాయంత్రం అతని ఇంటికి వెళ్లగా..నహక్, అతని కుమారులు రాళ్లు రువ్వారు. తన పెంపుడు కుక్కను రబీ..పోలీసులపైకి వదిలాడు. కానిస్టేబుల్ జగన్నాథ్ ఎడమ చేయిని కొరికింది. ఇదే టైంలో నిందితులు తప్పించుకున్నారని పోలీసులు వెల్లడించారు.