High Court : సహజీవనం వల్లే లైంగిక నేరాలు పెరుగుతున్నాయి..కీలక వ్యాఖ్యలు చేసిన కోర్టు

సహజీవనం సంస్కృతి కారణంగానే ఇటీవలి కాలంలో లైంగిక నేరాలు, వ్యభిచారం వంటివి పెరిగిపోతున్నాయని మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు చెందిన ఇండోర్‌ బెంచ్‌ వ్యాఖ్యానించింది.

High Court : సహజీవనం వల్లే లైంగిక నేరాలు పెరుగుతున్నాయి..కీలక వ్యాఖ్యలు చేసిన కోర్టు

Live In Relationships Are Leading To Rise In Sexual Offences, Promiscuity High Court

Live in relationships are leading to rise in sexual offences, promiscuity High Court : సహజీనం అనే సంస్కృతి గత కొంతకాలంలో భారత్ లో కూడా పెరుగుతోంది. ఇది మంచిదా? చెడ్డదా? దీని మహిళలకు అన్యాయం జరుగుతుందా?జరగదా? అసలు ఈ సహజీవనం అనే సంస్కృతి చట్టపరంగా సరైందా? కాదా? దీని వల్ల ఎవరికి ఎక్కువగా నష్టం జరుగుతుంది? సహజీవనం పిల్లలు పుట్టి వారు తరువాత విడిపోతే పిల్లల భవిష్యత్తు ఏమిటి? పిల్లల బాధ్యత ఎవరిది?  అనే పలు కీలక విషయాలు పక్కన పెడితే. సహజీవనం గురించి మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవనం వల్లే లైంగిక నేరాలు జరుగుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది మధ్యప్రదేశ్ హైకోర్టు.

Also read : సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

సహజీవనం సంస్కృతి కారణంగానే ఇటీవలి కాలంలో లైంగిక నేరాలు, వ్యభిచారం వంటివి పెరిగిపోతున్నాయని మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు చెందిన ఇండోర్‌ బెంచ్‌ పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం ప్రతీఒక్కరికి జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నాయి. ఇందులో సహజీవనం ఉండటం ఆందోళనకరమని జస్టిస్‌ సుబోధ్‌ అభ్యంకర్‌ అన్నారు.

మహిళపై అత్యాచారం చేశాడని ఆరోపించిన 25 ఏళ్ల యువకుడి ముందస్తు అరెస్టు (యాంసిపేటరీ) బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ హైకోర్టు ఇండోర్ బెంచ్‌లోని జస్టిస్ సుబోధ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Also read :  High Court : ఇద్దరి ఇష్టంతో సహజీవనం ప్రాథమిక హక్కు..వారికి వివాహ వయస్సు లేకున్నాసరే : హైకోర్టు కీలక వ్యాఖ్యలు

కాగా‘ సహజీవనం చేసి.. అతనితో శారీరక సంబంధం ఏర్పరచుకుంటే అది అత్యాచారం కిందకు రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.