Loan moratorium case: లోన్ మారటోరియం సెలక్ట్ చేసుకున్న వారికి సుప్రీం గుడ్ న్యూస్

మహమ్మారి సమయంలో లోన్ మారటోరియం ఆప్షన్ ఎంచుకున్న వారికి సుప్రీం కోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీపై వడ్డీ వసూలు చేయకూడదని స్పష్టం చేసింది. అధికమొత్తంలో వడ్డీ వసూలు చేస్తున్నారంటూ బ్యాంకులపై కంప్లైంట్ చేస్తూ..

Loan moratorium case: లోన్ మారటోరియం సెలక్ట్ చేసుకున్న వారికి సుప్రీం గుడ్ న్యూస్

rbi-loan-moratorium

Loan moratorium case: మహమ్మారి సమయంలో లోన్ మారటోరియం ఆప్షన్ ఎంచుకున్న వారికి సుప్రీం కోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీపై వడ్డీ వసూలు చేయకూడదని స్పష్టం చేసింది. అధికమొత్తంలో వడ్డీ వసూలు చేస్తున్నారంటూ బ్యాంకులపై కంప్లైంట్ చేస్తూ.. సుప్రీం మెట్లు ఎక్కారు. చాలాకాలంగా ఈ కేసులో వాదనలు వింటోన్న సుప్రీం.. తీర్పుపై లోన్ తీసుకున్న వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. సుప్రీం కోర్టు మంగళవారం అనేక విషయాలను స్పష్టం చేసింది.

వడ్డీపై వడ్డీ వసూలు చేయకూడదని.. ఒకవేళ బ్యాంకులు ఇప్పటికే వసూలు చేసినట్లు అయితే ఆ మొత్తాన్ని కస్టమర్ అకౌంట్‌లోకి అడ్జస్ట్ చేయాలని ఆదేశించింది. అంతేకానీ, వడ్డీ మొత్తం మినహాయించడం సాధ్యం కాదని చెప్పింది. అలా చేస్తే డిపాజిటర్లు నష్టపోతారని అభిప్రాయపడింది. బ్యాంకులు అకౌంట్ హోల్డర్లకు, పెన్షనర్లకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి రుణగ్రహీతలకు పూర్తిగా వడ్డీ మినహాయించడం సాధ్యం కాదని తెలిపింది.

మరోవైపు ఆర్థిక విధాన వ్యవహారాల విషయంలో న్యాయస్థానాలు సలహాదారులుగా వ్యవహరించలేవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆర్థికంగా ఊరట అందించే నిర్ణయాలను కోర్టులు నిర్ణయించలేవని తెలిపింది. ప్రభుత్వానికి లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఫైనాన్షియల్ ప్యాకేజీ లేదా రిలీఫ్ ప్రకటించాలని సుప్రీం కోర్టు ఆదేశించలేదని వెల్లడైంది.

కరోనా మహమ్మారి కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI 2020 మార్చి 27న రుణ వాయిదాలపై మారటోరియం ప్రకటించింది. మొదట మార్చి 1 నుంచి మే 31 వరకు 3 నెలల మారటోరియం ప్రకటించింది. ఆ తర్వాత మారటోరియంను 2020 ఆగస్ట్ 31 వరకు పొడిగించింది.

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మారటోరియం మరో ఆరు నెలలు పొడిగించాలంటూ ట్రేడ్ అసోసియేషన్స్ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లపై తీర్పును 2020 డిసెంబర్ 17న తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

పర్సనల్ లోన్, ప్రొఫెషనల్ లోన్, కన్స్యూమర్ లోన్, క్రెడిట్ కార్డ్ బిల్స్, హోమ్ అప్లయెన్సెస్ లోన్, ఆటో లోన్, ఎడ్యుకేషన్ లోన్, ఎంఎస్ఎంఈ లోన్లకు వడ్డీపై వడ్డీ మాఫీ పథకం వర్తిస్తుంది. వడ్డీపై వసూలు చేసిన వడ్డీని ఎక్స్‌గ్రేషియా రూపంలో బ్యాంకులు చెల్లిస్తున్నాయి. మొదట రూ.2 కోట్ల లోపు రుణాలకే వడ్డీపై వడ్డీ మాఫీ ప్రకటించినా ఇప్పుడు రూ.2 కోట్ల పైన రుణాలకూ వడ్డీపై వడ్డీ మాఫీ వర్తిస్తుంది.