పాకిస్తాన్ ముర్దాబాద్ : అమరవీరుడి అంతిమయాత్రలో నినాదాలు

  • Published By: venkaiahnaidu ,Published On : February 25, 2019 / 12:02 PM IST
పాకిస్తాన్ ముర్దాబాద్ : అమరవీరుడి అంతిమయాత్రలో నినాదాలు

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కుల్గామ్ జిల్లాలోని తారిగమ్ ప్రాంతంలో ఆదివారం(ఫిబ్రవరి-24,2019) జైషే మహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన డీఎస్పీ అమన్ ఠాకూర్ అంత్యక్రియలు సోమవారం(ఫిబ్రవరి-25,2019) జరిగాయి. దోడా జిల్లాలోని  గోగ్లా గ్రామంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి.అమరవీరుడి అంతిమయాత్రలో పాల్గొనేందుకు  పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొన్న ప్రజలు భారత్ మాతా కీ జై, పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు.

2011 బ్యాచ్ కేపీఎస్ ఆఫీసర్ అయిన అమన్.. ఏడాదిన్నరగా కుల్గామ్ జిల్లాలో జమ్మూకాశ్మీర్ పోలీస్ కౌంటర్ టెర్రరిజమ్ వింగ్ హెడ్ గా పనిచేస్తున్నారు. కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులను ఏరిపాయేడంలో అమన్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. అమన్ కు భార్యా సరలా దేవి, ఆరేళ్ల కొడుకు ఆర్య ఉన్నారు. 

ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఆదివారం కుల్గామ్ జిల్లాలోని తురిగామ్ గ్రామంలో పోలీస్, ఆర్మీ,సీఆర్పీఎఫ్ అధికారులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సమయంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు ప్రారంభించారు.ఈ కాల్పును బలగాలు ధీటుగా తిప్పికొట్టాయి. ముగ్గురు జైషే ఉగ్రవాదులను కాల్చి పడేశారు. అయితే దురదృష్టవశాత్తూ ఈ కాల్పుల్లో డీఎస్పీ అమన్ ఠాకూర్ మరణించారు. ఇద్దరు ఆర్మీ సిబ్బంది,ఓ మేజర్ కూడా ఈ కాల్పుల్లో గాయపడ్డారు. ఇటీవల పుల్వామా జిల్లాల్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడితో యావత్ భారతదేశం పాక్ పై ఆగ్రహంగా ఉంది. భారత ప్రభుత్వం కూడా పాక్ పై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ తో ఇక చర్చలు ఉండబోవని,చర్యలే ఉంటాయని భారత ప్రధాని నరేంద్రమోడీ హెచ్చరించిన విషయం తెలిసిందే.