AIIMS Chief : 10 శాతం పాజిటివ్ ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించాల్సిందే – ఎయిమ్స్

కనీసం పది శాతం పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించాల్సిందేనని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ రణ్ దీప్ గులేరియా స్పష్టం చేశారు.

AIIMS Chief : 10 శాతం పాజిటివ్ ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించాల్సిందే – ఎయిమ్స్

Aiims

Lock Down : భారతదేశంలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ప్రతి రోజు 3 లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడం..వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తుండడం సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. కరోనా సెకండ్ వేవ్ ఇంతతీవ్ర స్థాయిలో విస్తరిస్తుందని ఎవరూ ఊహించలేదు. భారీస్థాయిలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుండడంతో ఆసుపత్రుల వద్ద హృదయవిదాకర ఘటనలు కనిపిస్తున్నాయి. కరోనా చెయిన్ ను బ్రేక్ చేయాల్సిన అవసరం ప్రస్తుతం ఏర్పడిందన్నారు.

కనీసం పది శాతం పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించాల్సిందేనని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ రణ్ దీప్ గులేరియా స్పష్టం చేశారు. కరోనా కారణంగా..ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మెరుగైన హెల్త్ కేర్ వసతులను కల్పించాలని సూచించారు. ప్రజల ప్రాణాలను కాపాడడం చాలా ముఖ్యమని, కేసులు పెరిగిపోతుండడం వల్ల ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపెడుతోందన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని, వెంటనే ఆక్సిజన్ అందించాలని సూచించారు. ఈసారి కేసులు ఇంత స్థాయిలో పెరుగుతాయని ఊహించలేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని గులేరియా అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇక దేశంలో కరోనా విషయానికి వస్తే..గత 24 గంటల్లో 3 లక్షలకు పైగా కరోనా కేసులు వెలుగు చూశాయి. దేశంలో కొత్తగా 3 లక్షల 49 వేల 691 కరోనా కేసులు, 2 వేల 767 మరణాలు సంభవించాయి. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 26 లక్షలుగా ఉంది. మరోవైపు..27.79 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగాయి. గత 24 గంటల్లో 17 వేల 19 వేల 588 టెస్టులను నిర్వహించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 27 కోట్ల 79 వేల 18 వేల 810 టెస్టులు నిర్వహించారు.

Read More : Heart Breaking Scenes : ఢిల్లీలో కరోనా కల్లోలం, హాస్పిటల్ బయట ఆర్థనాదాలు..వీడియో వైరల్